SBI vs HDFC vs ICICI vs Kotak vs BoB: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ ఏ బ్యాంకు చెల్లిస్తుందో తెలుసుకోండి..!

|

Apr 25, 2022 | 3:51 PM

SBI vs HDFC vs ICICI vs Kotak vs BoB: సామాన్యులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన మార్గంగా భావిస్తారు. FDపై వచ్చే వడ్డీ అసలు మొత్తంపై ఆధారపడి ఉంటుంది.

SBI vs HDFC vs ICICI vs Kotak vs BoB: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ ఏ బ్యాంకు చెల్లిస్తుందో తెలుసుకోండి..!
Money Earning
Follow us on

SBI vs HDFC vs ICICI vs Kotak vs BoB: సామాన్యులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన మార్గంగా భావిస్తారు. FDపై వచ్చే వడ్డీ అసలు మొత్తంపై ఆధారపడి ఉంటుంది. వివిధ బ్యాంకులు FDలపై వేర్వేరు వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఎఫ్‌డిలో డబ్బును పెట్టుబడి పెట్టే ముందు వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లని తనిఖీ చేయడం ముఖ్యం. ఐదు బ్యాంకుల FD రేట్ల జాబితా గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కోటక్‌ మహీంద్రా బ్యాంకు

కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీని పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం కొత్త రేట్లు 12 ఏప్రిల్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. కొత్త పెంపు తర్వాత బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.50% నుంచి 5.60% వరకు వడ్డీని అందిస్తోంది.

HDFC బ్యాంక్ కొత్త FD రేట్లు

ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ కొత్త రేట్లు 6 ఏప్రిల్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. HDFC బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై సాధారణ ప్రజలకు 2.50 శాతం నుంచి 5.60 శాతం వడ్డీని అందిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) రూ. 2 కోట్ల కంటే తక్కువ FDలపై వడ్డీ రేట్లను మార్చి 22, 2022 నుంచి మార్చింది. FD వడ్డీ రేట్లలో సవరణ తర్వాత కొత్త రేట్లు 2.80 శాతం నుంచి 5.55 శాతం వరకు ఉంటాయి. ఈ రేట్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల FDలపై అందిస్తోంది.

SBI తాజా FD వడ్డీ

SBI 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య FDలపై సాధారణ కస్టమర్లకు 2.9% నుంచి 5.5% వరకు వడ్డీని అందిస్తోంది. ఈ కొత్త రేట్లు 15 ఫిబ్రవరి 2022 నుంచి అమలులోకి వచ్చాయి.

ICICI బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు

ICICI బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 2.50% నుంచి 5.60% వరకు వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు జనవరి 20, 2022 నుంచి అమలులోకి వచ్చాయి.

గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: మీ చిన్నతనంలో ఇలాంటి తుంటరి గేమ్‌ ఎప్పుడైనా ఆడారా.. పగలబడి నవ్వుతారు..!

IPL 2022: సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ కొట్టేశాడు.. కానీ 24 లక్షల ఫైన్‌ కూడా కట్టాడు..!

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి