Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..

|

Apr 11, 2022 | 7:05 PM

కరోనా బారినపడి రికవర్ అయిన​ పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని ఓ అధ్యయనం తెలిపింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తి ప్రోటీన్లు దెబ్బతింటాయని సైంటిష్టులు తెలిపారు.

Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..
Impact Of Covid 19
Follow us on

Covid-19 in Men: మహమ్మారి కరోనావైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఎంతోమంది ఆప్తుల్ని కోల్పోయారు. చాలామంది జీవనాధారాలను కోల్పోయారు. మహమ్మారి చేసిన డ్యామేజ్ అంతా.. ఇంతా కాదు. వైరస్ బారినపడి కోలుకున్నవారు సైతం కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కుంటున్నారు. తాజాగా ఐఐటీ బొంబాయి జరిపిన అధ్యయనం తాలూకా నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని(impair fertility) ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనను ఐఐటీ బొంబాయి(IIT Bombay) తో కలిసి జస్లోక్​ హాస్పిటల్, రీసెర్చ్​ సెంటర్​ సైంటిష్టులు సంయుక్తంగా నిర్వహించారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న పురుషులపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగుచూసింది.  మైల్డ్ సింటమ్స్‌తో కోవిడ్ సోకి.. రికవర్ అయినవారికి సైతం సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్​ ఒమెగా జర్నల్​ గతవారం పబ్లిష్ చేసింది. కరోనాకు కారణమైన సార్స్-2 వైరస్​ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తుందని.. దాంతో పాటు ఇతర వ్యవస్థలను కూడా డ్యామేజ్ చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు, మహమ్మారి​ కారణంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని వారు వివరించారు.

10 మంది ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కరోనా సోకి రికవర్ అయిన వారి వీర్యం శాంపిల్స్ విశ్లేషించినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోల్చగా.. కోవిడ్ సోకిన వారిలో వీర్య కణాలు గణనీయంగా తగ్గినట్లు వారి పరిశోధనల్లో తేలింది. సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్​1, ప్రోసాపోసిన్​ కోలుకున్న వారిలో తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే, ఈ అంశంపై ఇంకా లోతైన అధ్యయనాలు జరగాలని సైంటిష్టులు చెబుతున్నారు.

Also Read: Hyderabad: భర్త సంసారానికి పనికిరాడని విడాకులకు అప్లై.. అంతలోనే మానస మరణం.. మిస్టరీ