Dream: కలలో కోతి కనిపించిందా.? ఏం జరుగుతుందో తెలుసా..

నిద్రపోయిన తర్వాత కలలు రావడం సర్వసాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే రాత్రి పడుకున్న తర్వాత వచ్చే కలకు మన వాస్తవిక జీవితంలోని సంఘటనలకు సంబంధం ఉంటుందని మీకు తెలుసా.? పండితులు, స్వప్నశాస్త్రం ఇదే విషయాన్ని చెబుతోంది. అంతేకాకుండా మానసిక నిపుణులు సైతం మనకు వచ్చే కలలు...

Dream: కలలో కోతి కనిపించిందా.? ఏం జరుగుతుందో తెలుసా..
Monkey In Dream
Follow us

|

Updated on: Jun 29, 2024 | 5:44 PM

నిద్రపోయిన తర్వాత కలలు రావడం సర్వసాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే రాత్రి పడుకున్న తర్వాత వచ్చే కలకు మన వాస్తవిక జీవితంలోని సంఘటనలకు సంబంధం ఉంటుందని మీకు తెలుసా.? పండితులు, స్వప్నశాస్త్రం ఇదే విషయాన్ని చెబుతోంది. అంతేకాకుండా మానసిక నిపుణులు సైతం మనకు వచ్చే కలలు మన ఆలోచనలను ప్రతిబింబిస్తాయని చెబుతున్నారు. మరి కలలో కోతి కనిపిస్తే దేనికి సంకేతం, అసలు కోతులు ఎందుకు కనిపిస్తాయి.? లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* కలలో కోతి ఏదైనా ఆహారాన్ని తింటున్నట్లు కనిపిస్తే అశుభానికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఏదో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు భావించాలని అంటున్నారు.

* ఒకవేళ కలలో కోపంతో ఊగిపోతున్న కోతి కనిపిస్తే కూడా వ్యతిరేకతగా భావించాలని పండితులు అంటున్నారు. కోపంగా ఉన్న కోతి కనిపిస్తే ఇతరులతో వ్యవహరించే తీరులో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అనవసరంగా గొడవలు జరిగే అవకాశం ఉటుందని చెబుతున్నారు.

* కలలో కోతులు పోట్లాడుకున్నట్లు కనిపిస్తే.. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా భార్య,భర్తల మధ్య బంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* అయితే నవ్వుతున్న కోతి కలలో కనిపిస్తే మాత్రం మంచిదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా కోతులు నవ్వుతున్నట్లు మనకు తెలియదు. కానీ మన కలలో అలాంటి భావన మనకు కలిగితే ఏదో మంచి జీవితంలో జరగబోతోందని అర్థం చేసుకోవాలి.

* ఇక కలలో కోతి ఇత కోడుతున్నట్లు కనిపిస్తే మంచికి సంకేతంగా భావించాలి. భవిష్యత్తులో ఏదో లాభం మీకు జరగబోతోందని, అప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

* కలలో కోతుల గుంపు కనిపించినా అది మంచి సంకేతంగా భావించాలని పండితులు అంటున్నారు. కోతుల గుంపు కలలో కనిపిస్తే ఉన్నపలంగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయని స్వప్నశాస్త్రంలో పేర్కొన్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..