మరి ఆ హీరోతో జతకట్టనున్న అనుపమ.. హిట్ కాంబో రిపీట్.
Anil Kumar
01 July 2024
బెల్లం కొండ శ్రీనివాస్ అనుపమ కలిసి నటించిన రాక్షసుడు సినిమా మంచి విజయాన్ని సంధించిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని.. ప్రకటించిన దగ్గర నుంచి ప్రేక్షకులలో మరింత ఆసక్తి మొదలైంది.
అయితే మొదటి పార్ట్ లో బెల్లంకొండ నటించారు.. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ కి మరో హీరో పేరు కూడా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటె ఈ సినిమాలో అనుపమ, సాయి శ్రీనివాస్ కలిసి తమ నటనతో ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించారు అనే చెప్పాలి.
క్రైమ్ ధ్రిల్లర్ రాక్షసుడు తర్వాత మరోసారి కలిసి నటించబోతున్నారు అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ శ్రీనివాస్.
సాహు గారపాటి నిర్మాణంలో కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ జులై 1న జరిగింది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో అనుపమతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు బెల్లంకొండ.
ఒకసారి హిట్ అందుకున్న పెయిర్ మల్లి కలిసి నటిస్తున్నారు అంటే టాలీవుడ్ క్యూరియాసిటీ ఎక్కువగానే ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి