వర్షాకాలంలో ఈ కూరగాయలు తినకండి.. ఆరోగ్యానికి హానికరం 

01 July 2024

TV9 Telugu

Pic credit - pexels

వర్షాకాలంలో తినే ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో కొన్ని కూరగాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు రావచ్చు. 

 ఏ ఆహారం తినాలంటే 

ఈ సీజన్‌లో వంకాయను తినడం హానికరం అంటున్నారు ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ కమల్జీత్ సింగ్. ఆరోగ్యాన్ని పాడుచేసే సోలనిన్ మూలకం ఇందులో ఉంటుంది.

వంకాయ 

వర్షాకాలంలో క్యాలీఫ్లవర్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. వీటిని తినకుండా ఉండాలి.

 కాలీఫ్లవర్

వర్షాకాలంలో పాల కూరను తినకుండా ఉండాలి. ఇందులో ఉండే ఐరన్ జీర్ణకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అంతేకాదు పాలకూర తీసుకోవడం వల్ల పిత్త దోషం పెరుగుతుంది.

పాలకూర 

ఈ సీజన్‌లో క్యాబేజీని తినకుండా ఉండాలి. చాలా మంది క్యాబేజీని సలాడ్ లేదా నూడుల్స్‌లో తీసుకుంటారు. క్యాబేజీని ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది.

 క్యాప్సికమ్ 

ఈ సీజన్‌లో క్యాప్సికం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని తినడం వల్ల పిత్త దోషం సమస్య వస్తుంది. అంతేకాదు ఇది జీర్ణక్రియను కూడా పాడు చేస్తుంది.

 క్యాప్సికమ్ 

 ఈ వర్షాకాలంలో కాకర కాయ, ఆనపకాయ,  బీరకాయ వంటి వాటిని ఎక్కువగా తినాలి. ఈ కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఏమి తినాలంటే