జీవితాంతం గుర్తుండేలా ఉంటుంది ఓజీ.! వైరల్ అవుతున్న తమన్ కామెంట్స్.
Anil Kumar
01 July 2024
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. దీన్ని సుజీత్ డైరక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మధ్య రిలీజ్ అయినా వీడియో యూట్యూబ్ ని షేక్ చేసింది.
తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక అభిమాని కట్ చేసిన వీడియో చూసి.. దానికి స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసారు తమన్.
ఓజీ సినిమాలో లైఫ్ టైమ్ గుర్తుండిపోయే విషయాలు చాలానే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా తెలిపారు తమన్..
షూటింగ్ అప్డేట్ గురించి చెప్పలేదు కానీ.. పవన్ న్యూ వరల్డ్.. ఓజీ కోసం మాత్రం వెయిట్ చేయమని హింట్ ఇచ్చారు.
మొన్నటి వరకు రాజకీయా ప్రచారంలో బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు.
ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినా ఆయన.. తాజాగా వారాహి దీక్ష చెప్పటి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి