ఒక వ్యక్తి, ఆ మాటకొస్తే ఒక తరం భవిష్యత్తును మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ప్రతీ ఒక్క పేరెంట్ కోరుకుంటారు. అందుకోసం అహర్నిశలు కృషి చేస్తుంటారు. ఇక ఇటీవల విదేశాల్లో ఉన్నత చదువుల ట్రెండ్ నడుస్తోంది. పీజీ కోసం విదేశాలకు చిన్నారులను పంపిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
అయితే మీరు కూడా మీ పిల్లల్ని విదేశాల్లో చదివించాలని భావిస్తే ఆ సమయానికి ఎంత ఖర్చు అవుతుంది..? అందుకు అవసరమయ్యే నిధులను ఎలా సమకూర్చాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఇప్పుడు మీకు ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారి ఉన్నట్లైతే.. పీజీ సమయానికి సరాసరి ఇంకో 20 ఏళ్లు పడుతుంది. మరి ఆ సమయానికి విదేశాల్లో డిగ్రీ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది.? ఈ పిల్లల విదేశీ కలను ఎలా నిజం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం విదేశాల్లో పీజీ పూర్తి చేయాలంటే దాదాపు రూ. 40 నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఐలెట్స్, టోఫెల్‌లో మంచి ర్యాంక్ వస్తే.. విదేశాల్లో ఉన్న పలు యూనివర్సిటీలు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తుంటాయి. అయితే సాధారణంగా సొంతం ఖర్చు చేసుకోవాలంటే కనీసం రూ. 40 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే 20 ఏళ్ల తర్వాత ఈ మొత్తం మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం, పెరుగుతోన్న ఖర్చుల ప్రకారం.. 20 ఏళ్ల తర్వాత కనీసం రూ. కోటి ఖర్చవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లలో అంత మొత్తం సంపాదించాలంటే కష్టంతో కూడుకున్న అంశం. అయితే సిప్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభిస్తే మీ చిన్నారి విదేశీ విద్యను నిజం చేయొచ్చు. ఇందుకోసం నేటి నుంచే సిప్‌ని ప్రారంభించాలి. ఉదాహరణకు మీరు నెలకు రూ. 10,000 సిప్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. 20 ఏళ్లలో సగటున 12 శాతం రాబడిని ఇస్తే, మీకు దాదాపు రూ. 1 కోటి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో సగటు వార్షిక రాబడి సుమారు 15 శాతంగా లెక్కలోకి తీసుకుందాం. ఈ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు సుమారు రూ. 1.5 కోట్లు రిటర్న్స్ వస్తాయి. అంటే మీ చిన్నారి 20 ఏళ్ల వయస్సు వచ్చేనాటికి మీ వద్ద రూ. 1.5 కోట్లు ఉంటాయి. దీంతో మీ చిన్నారి విదేశీ బిడ్డను నిజం చేయొచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటే.. ఆ సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విదేశీ విద్యను పూర్తి చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..