
మన భారతీయుల్లో ఎన్నో నమ్మకాలు ఉంటాయి. ఏదైనా పని మొదలు పెట్టే ముందు తుమ్మినా, పిల్లి అడ్డొచ్చినా అపశకునంలా భావించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఇలాంటి నమ్మకాల్లో కుక్క ఏడుపు ఒకటి. చిమ్మటి చీకట్లో కుక్కలు అరిస్తే భయంగా ఉంటుంది. వీధిలో కుక్క ఏడిస్తే ఆ రోజు ఎవరో చనిపోతారని చాలా మంది భావిస్తుంటారు. ఎవరైనా చనిపోయే ముందు కుక్కలు ఏడుస్తాయని చాలా మంది నమ్మకం. ఇంతకీ కుక్కలు ఎందుకు ఏడుస్తాయి.? నిజంగానే మనుషులు చనిపోయే ముందు వాటికి తెలుస్తాయా.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కుక్కలు ఏడిస్తే అపశకునం అనే నమ్మకం కేవలం భారతీయుల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఉంది. అమెరికా వంటి అగ్ర రాజ్యంలోనూ ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. రెండు కుక్కలు కలిసి ఏడిస్తే ఒక వ్యక్తి మరణిస్తారని నమ్ముతారు. అదే మూడు కుక్కలు కలిసి ఏడిస్తే స్త్రీ మరణిస్తుందని నమ్ముతుంటారు. అయితే ఇలాంటి నమ్మకాలన్నీ మూడా నమ్మకాలే అని సైన్స్ చెబుతోంది. కుక్క అరుపులు, ఏడుపు వెనకాల కొన్ని కారణాలు ఉంటాయని చెబుతున్నారు. సైన్స్ ప్రకారం కుక్కల ఏడుపు వెనకా ఉన్న అసలు విషయలు ఇవే..
* కుక్క ఏడుపు వెనకాల జన్యు సంబంధమైన కారణాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. పురాతన కుక్క జాతుల డీఎన్‌ఏ.. తోడేళ్లు, నక్క జాతులను పోలి ఉంటయాని, కుక్కలు అలా అరదడానికి వాటీ డీఎన్‌ఏనే కారణం అని చెబుతున్నారు.
* అలాగే కుక్కులు ఆహారం కోసం వేట ముగిసిన తర్వాత అన్ని ఒక దగ్గర సమావేశం అవుతాయి. రాత్రుళ్లు చీకటిగా ఉండడంతో వాటి స్థావరాన్ని సహచర కుక్కలకు తెలిపేందుకు అలా అరుస్తాయని చెబతారు.
* ఇక మనుషుల్లాగే కుక్కలు కూడా భావోద్వేగాలను వ్యక్తీకరిస్తాయి. బాధ, కోపం, ఆవేదన, ఆందోళనను ఇలా శోకం పెట్టి ఏడవడం ద్వారా చూపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. నొప్పిని భరించలేని సందర్భంలోనూ అవి ఇలా అరుస్తాయని పరిశోధకులు అంటున్నారు.
* కుక్కలు ఏడిస్తే మనుషులు చనిపోతారన్న దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతోన్న పరిశోధకులు, ఒకవేళ అలా జరిగితే అది కేవలం యాధృచ్ఛికం అని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..