ఇలాంటి బాస్‌ ఉంటే పండగే పండగ..! ధంతేరస్‌ రోజున ఉద్యోగులకు లక్షల రూపాయల కానుక!

దీపావళి పండుగ వేళ గుజరాత్‌లో ఓ వ్యాపారవేత్త తన ఉద్యోగులకు ఇచ్చిన బహుమతి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పండుగను ఉద్యోగులు కూడా ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా ఒక్కొక్కరికి రూ.88 వేల చొప్పున నగదును బోనస్‌గా అందజేశారు. ఈ ఉదారతతో ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు.

ఇలాంటి బాస్‌ ఉంటే పండగే పండగ..! ధంతేరస్‌ రోజున ఉద్యోగులకు లక్షల రూపాయల కానుక!
Businessman Gifts Diwali Bonus

Updated on: Nov 08, 2026 | 9:16 AM

సూరత్‌: దీపావళి పండుగ వేళ గుజరాత్‌లో ఓ వ్యాపారవేత్త తన ఉద్యోగులకు ఇచ్చిన బహుమతి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పండుగను ఉద్యోగులు కూడా ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా ఒక్కొక్కరికి రూ.88 వేల చొప్పున నగదును బోనస్‌గా అందజేశారు. ఈ ఉదారతతో ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు.

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారవేత్త రామ్‌స్వరూప్ ముండ్ ధంతేరస్‌ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తన వద్ద పనిచేస్తున్న సుమారు 21 మంది ఉద్యోగులకు భారీ మొత్తంలో నగదును పంపిణీ చేశారు. రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్ల కట్టలను ఉద్యోగులకు అందించారు. ఒక్కొక్క ఉద్యోగికి రూ.88 వేల చొప్పున ఇవ్వడంతో మొత్తం మీద సుమారు రూ.18.48 లక్షలను బోనస్‌గా పంపిణీ చేసినట్లయింది.

రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు చెందిన రామ్‌స్వరూప్ ముండ్.. అందరూ దీపావళిని సంతోషంగా, సుసంపన్నంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బహుమతులు అందించినట్లు తెలిపారు. డబ్బు అందుకున్న ఓ మహిళా ఉద్యోగి భావోద్వేగానికి గురవడం అక్కడున్న వారిని కదిలించింది.

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఇది ఒక్క ఏడాదికే పరిమితమైన కార్యక్రమం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రతి ధంతేరస్‌ సందర్భంగా తన ఉద్యోగులకు ఇలా నగదు బహుమతులు అందిస్తున్నారు. వ్యాపారంలో తనకు తోడుగా నిలిచే ఉద్యోగుల సంతోషాన్ని కూడా తన బాధ్యతగా భావిస్తూ ఆయన చేస్తున్న ఈ పని ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. నిజమైన పండుగ సంతోషం అంటే మనతో పాటు పనిచేసే వారినీ ఆనందంగా ఉంచడమేనని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us