Couple Donates Blood :సాధారణంగా తమ పెళ్లిరోజును భార్యాభర్తలు ఉత్సాహంగా, వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ యూపీలో ఓ జంట మాత్రం అలాంటి సెలబ్రేషన్స్ కి పోకుండా ప్రాణాపాయస్థితిలో, రక్తం అవసరమైన బాలికను రక్షించడానికి ముందుకు వచ్చారు. ఈ బాలిక ఎవరి బిడ్డోనని, దీంతో ఆమెకు సాయం చేసేందుకు, రక్త దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని యూపీ పోలీసు అధికారి ఆశిష్ మిశ్రా అన్నారు. ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరమని తెలుసుకున్న ఈ జంట తమ పెళ్లి రోజును కూడా పట్టించుకోకుండా పెళ్లి బట్టల్లోనే వఛ్చి రక్తదానం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను యూపీ పోలీసులు ‘పోలీస్ మిత్ర’ పేరిట నిర్వహిస్తుంటారు. ఎవరో అజ్ఞాత బాలికకు రక్తాన్ని ఇఛ్చి ఆదుకున్న ఈ భార్యాభర్తలను ఆశిష్ మిశ్రా అభినందించారు. మై ఇండియా ఈజ్ గ్రేట్ అని హిందీలో ట్వీట్ చేశారు.
రక్తం అత్యవసరమైన రోగులను డోనర్లతో కలిపేందుకు ఈయన 2017 లో పోలీస్ మిత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఈ భార్యా భర్తలను అనేకమంది ప్రశంసించారు.