MAN WITH SNAKE : ఆకలితో అలమటించిపోయే మూగ జీవాలకు ఎంతో మంది జంతుప్రేమికులు సాయం అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. అయితే మరి నిలువెల్ల విషం ఉండి.. చూడగానే బుసలు కొట్టే.. పామును ఏం చేస్తాం. అకలేసో.. దాహంమేసో.. రోడ్డు పక్కనే.. పడుకున్న పాము మనకు ఎదురైతే ఏం చేస్తాం. మా అంటే.. పక్కకు తప్పుకోనీ.. లేదా బెదిరిపోయి.. వెనక్కి తిరిగి పారిపోతాం. కానీ.. ఓ వ్యకి.. దాన్ని దగ్గరకు తీసుకోని మరీ నీళ్లు పట్టించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నాగుపాముకు ఓ వ్యక్తి బాటిల్‌తో నీరు తాగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి దాహంతో ఉన్న నాగుపాముకు దగ్గరగా వెళ్లి దాని నోటికి వాటర్ బాటిల్ అందించాడు. అప్పుడు ఆ పాము నీరు గుటగుట తాగేస్తున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 9వేలకు పైగా వ్యూస్, లక్షల్లో లైకులు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. పాముకు దగ్గరగా వెళ్లి మరీ నీరు తాగిస్తున్న సదరు వ్యక్తి ధైర్యానికి అవాక్కవుతూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.