Optical illusion: మీకు మంచి IQ ఉంటె 10 సెకన్లలో పిల్లిని కనిపెట్టండి చూద్దాం..!

ఇవాళ్టి మన ఆప్టికల్ ఇల్యూషన్ లో మీరు పిల్లిని కనిపెట్టాల్సి ఉంటుంది. అది కూడా కేవలం 10 సెకన్లలోనే గుర్తించాలి. ఈ టాస్క్ చాలా సరదాగా కూడా ఉంటుంది. మీ కంటి చూపు పరీక్షించుకోవడానికి ఈ సరదా ఛాలెంజ్ మీ కోసం. రెడీనా మీరు.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే పాల్గొనండి.

Optical illusion: మీకు మంచి IQ ఉంటె 10 సెకన్లలో పిల్లిని కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion

Updated on: Feb 21, 2025 | 3:00 PM

ఈ రోజు పిల్లులను ప్రేమించే వారందరికీ ఒక సరదా బ్రెయిన్ టీజర్ తెచ్చాం. మీ చేతుల్లో పిల్లిని పెట్టలేం కానీ.. మీ మెదడును పరీక్షించే ఒక మంచి పజిల్‌ను ఇవ్వగలుగుతున్నాం. మన ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ లో అందమైన ఇళ్లతో ఉన్న ఒక పట్టణం కనిపిస్తుంది. కానీ మీ టాస్క్ ఇళ్లను చూడటం మాత్రం కాదు.. అందులో దాగి ఉన్న పిల్లిని కనుగొనడం. మీరు 10 సెకన్లలో ఈ టాస్క్ ని ఫినీష్ చేయగలరా..? లేదా అనేది చూద్దాం.

మరోసారి బాగా ఫోకస్ చేసి చూడండి. సమయం చాలా ముఖ్యమైనది. ఏదో ఏదో ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేయకండి. ఇంట్రెస్ట్ పెట్టి ఈ టాస్క్ ని ఫినీష్ చేయండి. ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల మీరు చాలా తక్కువ సమయంలోనే కంప్లీట్ చేస్తారు. మీకు 10 సెకన్ల సమయం అవసరం లేదు. జస్ట్ ఇలా చూడగానే కనిపెట్టేస్తారు.

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ టాస్క్ లకు ఈ టైమ్ లిమిట్స్ ఏంటని ఆలోచిస్తున్నారా..? లేదా మీకు కోపం వస్తుందా..? ఈ విధమైన ఇల్యూషన్‌కు టైమ్ లిమిట్ ఉంటేనే అది మరింత ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి మీ దృష్టిని పదును పెట్టుకొని 10 సెకన్లలోపు పిల్లిని కనిపెట్టండి.

కేవలం చురుకైన చూపు, మంచి గమనించే నైపుణ్యం, ముఖ్యంగా పిల్లులపై ప్రేమ ఉన్నవారే ఈ చిత్రంలో దాగిన పిల్లిని 10 సెకన్లలో గుర్తించగలరు. మిగతావారు కాస్త ఎక్కువ సమయం తీసుకోవాల్సి రావొచ్చు. ఇప్పుడు మీ గమనించే శక్తిని పరీక్షించుకోండి. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా… ఒక్కటి… రెండు… మూడు… నాలుగు… ఐదు… ఆరు… ఏడు… ఎనిమిది… తొమ్మిది… పది… మీ సమయం ముగిసింది.

పిల్లిని కనుగొన్నారా..? లేక ఇంకా హింట్ కావాలా..? ఈసారి మేము మీకు పెద్దగా హింట్ ఇవ్వలేం. ఎందుకంటే అది సరదాను తగ్గించేస్తుంది. మళ్లీ ప్రయత్నించండి గమనించి బాగా చూసినప్పుడు తప్పకుండా కనిపిస్తుంది. కొంతమంది చాలా త్వరగానే కనుగొన్నారు. వారికి అభినందనలు. ఇంకా కనిపెట్టని వారు చింతించకండి. నేను మీకోసం పిల్లిని పట్టుకొచ్చాను గా ఇగో ఇక్కడే ఇమేజ్ లో ఉంది చూడండి. చూసి తీసుకెళ్లండి.