
మన దృష్టి శక్తి ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఇల్యూషన్‌లు ఉపయోగపడతాయి. సాధారణంగా మన కళ్ల ముందు ఏదైనా వస్తువును చూసినప్పుడు. దానిని ఎలా అర్థం చేసుకోవాలనేది మన మెదడు నిర్ణయిస్తుంది. కొన్ని సందర్భాల్లో, మన మెదడు చూసిన దాన్ని వేరుగా గ్రహించవచ్చు. ఇదే ఆప్టికల్ ఇల్యూషన్‌లో జరుగుతుంది. కళ్లతో చూస్తున్నప్పటికీ నిజమైన విషయాన్ని గుర్తించడం కష్టమవుతుంది.
ఇప్పుడు మీ దృష్టి సామర్థ్యాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది. మీకు ఒక చిన్న టాస్క్. ఈ చిత్రాన్ని గమనించండి. ఇందులో అనేక చోట్ల 86 ‘నెంబర్స్ కనిపిస్తుంటాయి. కానీ ఈ సంఖ్యల మధ్యలో ఎక్కడో ఒక చోట 68 నెంబర్ కూడా ఉంది. మీ పని ఏంటంటే కేవలం 5 సెకన్లలో దానిని గుర్తించడం. ఈ చిన్న పరీక్ష ద్వారా మీ దృష్టి ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. చాలా మంది తప్పుడు సంఖ్యల వల్ల గందరగోళానికి గురవుతారు. కానీ ఏవైనా చిన్న మార్పులను గమనించగల సామర్థ్యం ఉన్నవారు తక్కువ సమయంలోనే సరైన సంఖ్యను గుర్తించగలరు.
ఇలాంటి ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్‌ను తరచూ పరిశీలించడం వల్ల మన దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది. మనం రోజూ చూస్తున్న దృశ్యాల్లో చిన్న మార్పులను కూడా గమనించే అలవాటు ఏర్పడుతుంది. అలాగే మెదడు కొత్త విధానాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించేలా మారుతుంది. ఇలాంటి ప్రయోగాలు మన మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆలోచనా శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా చిన్న విషయాలను పట్టుకోవడం నేర్చుకోవడానికి ఇవి ఎంతో సహాయపడతాయి.
మీరు 5 సెకన్లలో 68 సంఖ్యను గుర్తించగలిగారా..? అయితే మీ దృష్టి శక్తి చాలా అద్భుతంగా ఉంది. మీకు అభినందనలు. కానీ ఇంకా గమనించలేకపోతే మరోసారి ప్రయత్నించండి. కనిపెట్టని వారు బాగా ఫోకస్ చేసి మరోసారి ఇమేజ్ ని చూడండి. అయినా కనిపించలేదా.. సరే అయితే ఇమేజ్ లో 68 నెంబర్ ను హైలైట్ చేసి ఉంది. ఇప్పుడు చూడండి. కనిపెట్టని వారు ఇలాంటి పజిల్స్‌ను తరచుగా చూస్తూ ఉండండి. అప్పుడు ఇలాంటి పజిల్స్ ని ఈజీగా కంప్లీట్ చేస్తారు.