BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు రిపబ్లిక్ డే ఆఫర్.. ఇక నుంచి అన్ని సర్కిళ్లలో..

|

Jan 26, 2021 | 6:39 PM

BSNL New Plan: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎస్(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులకు..

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు రిపబ్లిక్ డే ఆఫర్.. ఇక నుంచి అన్ని సర్కిళ్లలో..
Follow us on

BSNL New Plan: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎస్(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ తన రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పొడిగించింది. అంతేకాదు.. ఇప్పటి వరకు కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్న స్కీమ్‌ను దేశ వ్యాప్తంగా మరికొన్ని సర్కిళ్లలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

కాగా, గత సంవత్సరమే రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అయితే కొన్ని సర్కిళ్లలో మాత్రమే దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్లాన్‌ను మరిన్ని సర్కిళ్లకు విస్తరింపజేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించింది. ఈ ప్లాన్‌ ముఖ్యంగా ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడే వారికి ఉపయోగకరం అని చెప్పాలి. ఈ ప్లాన్‌ను వేయించుకున్న వినియోదారులు దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే 160 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో రోజువారీ వినియోగం కింద 0.5 జీబీ లభిస్తుంది. నిర్ధిష్ట డేటా వినియోగం పూర్తయిన తరువాత నెట్ స్పీడ్ 80 కేజీపీఎస్‌కు తగ్గుతుంది.

Also read:

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్​లో వేరుశనగకు రికార్డ్‌ ధర.. క్వింటాల్ రూ. 8113 అమ్మిన రైతు

ఢిల్లీ అల్లర్లపై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ దిగ్భ్రాంతి, రైతులు తిరిగి సింఘు బోర్డర్ చేరుకోవాలని సూచన