Bihar Groom Puts Lalu Prasad Yadavs Photo : బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఓ పెళ్లి కొడుకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు పెద్ద అభిమాని. ఆర్జేడీ అధినేతపై తన ప్రేమను, విధేయతను తన వివాహ కార్డుపై ముద్రించి ప్రదర్శించారు. అంతే కాదు లాలూ ప్రసాద్ యాదవ్‌ను విడుదల చేయాలని నినాదంతో పాటు ఆర్జేడీ ఎన్నికల చిహ్నం-లాంతరును కార్డుపై ముద్రించాడు. జాగ్రన్ నివేదిక ప్రకారం.. వైశాలిలోని రాహువా గ్రామంలో నివసిస్తున్న పవన్ కుమార్ యాదవ్ ఏప్రిల్ 23 న వివాహం చేసుకోబోతున్నాడు. పవన్ ఈ ప్రత్యేకమైన వివాహ కార్డును ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు తేజశ్వి యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ కుమారుడికి పంపారు. మాజీ ఆరోగ్య మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్ సహా ప్రముఖ ఆర్జేడీ నాయకులను తన వివాహ వేడుకకు ఆహ్వానించాడు.
దీని వెనుక గల కారణం ఏమిటని అడిగినప్పుడు.. తాను లాలూ ప్రసాద్ యాదవ్‌కు మద్దతుదారుడని, తనను ఆరాధిస్తున్నానని పవన్ చెప్పాడు. అతను ఒక నిరుపేదవాడినని, ఉన్నతాధికారులతో మాట్లాడలేనని అందుకే ఆయన విడుదల చేయాలని ఈ విధంగా కోరానని చెప్పుకొచ్చాడు. లాలూ ప్రసాద్ త్వరలో విడుదల అవుతారని ఆయన మళ్లీ ఆరోగ్యంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుటుంబం తన వివాహానికి హాజరై ఆశీర్వదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1990 ల ప్రారంభంలో డుమ్కా ఖజానా నుంచి రూ .3.13 కోట్లు మోసపూరితంగా ఉపసంహరించుకున్న కేసులో.. పశుగ్రాసం కుంభకోణం కేసులో 2018 లో ప్రత్యేక సీబీఐ కోర్టు 60 లక్షల జరిమానా, 14 సంవత్సరాల జైలు శిక్ష ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు విధించింది. ప్రస్తుతం తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ఆర్జేడీ చీఫ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు పిటిషన్‌ను జార్ఖాండ్ హైకోర్టు ఏప్రిల్ 16 కి వాయిదా వేసింది.