Fake Calls: ఇన్స్యూరెన్స్ పాలసీలపై కన్నేసారు..! నమ్మారో అంతే.! తస్మాత్ జాగ్రత్త..!

|

Dec 11, 2022 | 3:41 PM

ప్రీమియం సరిగ్గా కట్టక లాప్స్ అయిపోయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు మళ్లీ యాక్టివేట్ చేస్తాం అంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. మీరు ఇన్నాళ్లూ కట్టని ప్రీమియం మొత్తం పోతుంది.

Fake Calls: ఇన్స్యూరెన్స్ పాలసీలపై కన్నేసారు..! నమ్మారో అంతే.! తస్మాత్ జాగ్రత్త..!
Fake Calls
Follow us on

ఫేక్ కాల్స్.. ఇటీవల కాలంలో చాలా ఎక్కువయ్యాయి. మీకు లోన్ వచ్చింది.. కొంత డబ్బులు డిపాజిట్ చేయండి.. మీకు లాటరీ తగిలింది.. ప్రాసెసింగ్ ఫీజు కట్టండి.. మీ ఫోన్ నంబర్కు గిఫ్ట్ వచ్చింది.. పోస్టల్ చార్జీలు పంపండి.. వంటి కాల్స్, మేసేజ్ లు ఇబ్బడిముబ్బడిగా వస్తుంటాయి. వాటిని అలా చూసి.. అలా వదిలేయడం ఉత్తమం. నమ్మామో నట్టేటా మునుగడం ఖాయం. ఇదే కోవలో మరో కొత్త మోసం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

ప్రీమియం సరిగ్గా కట్టక లాప్స్ అయిపోయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు మళ్లీ యాక్టివేట్ చేస్తాం అంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. మీరు ఇన్నాళ్లూ కట్టని ప్రీమియం మొత్తం పోతుంది. వెంటనే రెన్యూవల్ కోసం నగదు పంపండి అంటూ లింక్స్ పంపుతూ పాలసీ హోల్డర్లను బురిడి కొట్టిస్తున్నారు. అటువంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పడు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో
అసలు మనకు వచ్చింది ఫేక్ కాల్ ఆ? ఒరిజనల్ కాల్ నా? అసలు నిజంగా లాప్స్ లేదా కాలపరిమితి దాటిపోయిన పాలసీలను తిరిగి రెన్యూవల్ చేసుకునే వీలుంటుందా? కొత్త పొలసీ తీసుకుంటే మంచిదా.. లేక ఉన్న పాలసీని రెన్యూవల్ చేసుకుంటే మంచిదా? అనే విషయాలను గురించి తెలుసుకుందాం.

గుర్తించడమే ముఖ్యం..
సాధారణంగా ఒక అన్ నోన్ నంబర్ ను ఫోన్ కాల్ వచ్చినప్పుడు అది ఫేకా లేదా అనేది గుర్తించడం కొంచెం కష్టమే. ఎందుకంటే కాల్ చేసిన వారు ఇన్స్యూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) నుంచి కాల్ చేస్తున్నట్లు నమ్మిస్తారు. అయితే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఒకటి ఉంది. మీకు ఎవరైనా లాప్స్ అయిపోయిన పాలసీని తిరిగి పునరుద్ధరిస్తామని కాల్ చేస్తే.. ఆ కాలర్ పేరు డీటైల్స్ తీసుకోండి.. ఆ పాలసీ కంపెనీ నుంచి కావాల్సిన డాక్యూమెంట్స్, కట్టాల్సిన నగదు వివరాలను ఈ మెయిల్ చేయమని చెప్పండి. లేదంటే వెంటనే ఆ ఫోన్ కట్ చేసి మీరు పాలసీ తీసుకున్న కంపెనీ కస్టమర్ కేర్ నంబర్లకు ఫోన్ చేసి విషయం చెప్పి.. అది నిజమోకాదో నిర్ధారించుకోండి. ఏదైనా నగదు జమ చేస్తే కేవలం ఇన్స్యూరెన్స్ కంపెనీ ఖాతాకు మాత్రమే చేస్తామని చెప్పండి. లేదా డైరెక్ట్ ఆఫీసుకు వస్తామని చెప్పండి. అప్పుడు కాల్ చేసిన వారి సమాధానాన్ని బట్టి అది ఫేక్ కాల్ నా.. కంపెనీ కాలా అనేది తెలిసిపోతుంది.

మీ పాలనీని వదిలేయొద్దు..
ఏదైనా లైఫ్ ఇన్స్యూరెన్ ప్రీమియం నెల నెలా డ్యూ డేట్ లోపు కట్టాలి. అలా కట్టకపోతే… ఆ కంపెనీ 15 రోజుల పాటు గ్రేస్ పిరియడ్ ఇస్తుంది. ఈ సమయంలోపు కూడా ప్రీమియం చెల్లించకపోతే ఆ పాలసీ లాప్స్ అయిపోతుంది. అంటే డీ ఆక్టివేట్ అయిపోతుంది. తద్వారా ఆ పాలసీ నామినీకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా రావు.

కొత్తది కన్నా పాతది రిన్యూవలే బెటర్..
ఒక పాలసీ లాప్స్ అయిపోయింది కదా అని చాలా మంది దానిని వదిలేసి కొత్త పాలసీ తీసుకుంటుంటారు. అయితే అలా కొత్త పాలసీ తీసుకోవాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. మెడికల్ టెస్ట్లు చేయించుకోవాలి. చాలా తతంగం ఉంటుంది. దాని బదులు మధ్యలో నిలిపివేయబడిన పాలసీని ఏదో ఒక రంగంగా యాక్టివేట్ చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేసుకోవడానికి ఓ విధానం ఉందని వివరిస్తున్నారు.

ఇలా రెన్యూవల్ చేసుకోవచ్చు..
ప్రీమియం కట్టడం నిలిపివేసిన దగ్గర నుంచి మళ్లీ రెన్యూవల్ చేసే సమయం వరకూ అవుట్ స్టాండింగ్ ప్రీమియంలను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే ట్యాక్స్, ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీ విధించే పెనాల్టీ కూడా చెల్లించాల్సి వస్తుంది.
అయితే 2019 ముందు కనుక మీరు పాలసీ తీసుకుని ఉంటే లాప్స్ అయిన రెండేళ్లలోపు మళ్లీ రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే 2019 తర్వాత అయితే ఐదేళ్ల వరకూ అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతకు మించితే మాత్రం శాశ్వతంగా పాలసీ టెర్మినేట్ అవుతుందని పేర్కొంటున్నారు.