Vastu Tips: టెర్రస్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా.? వెంటనే తీసేయకపోతే..

ఇంట్లో అన్ని అనుకూలంగా ఉండాలన్నా, కుటుంబ సభ్యుల మధ్య సక్కత ఉండాలన్నా వాస్తు నియమాలు పాటించాలని పండితులు చెబుతుంటారు. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి ఇంటి మేడపై పెట్టే వస్తువులు. వాస్తు శాస్త్రం ప్రకారం...

Vastu Tips: టెర్రస్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా.? వెంటనే తీసేయకపోతే..
Vastu Tips

Updated on: Jun 22, 2024 | 11:55 AM

ఇంట్లో అన్ని అనుకూలంగా ఉండాలన్నా, కుటుంబ సభ్యుల మధ్య సక్కత ఉండాలన్నా వాస్తు నియమాలు పాటించాలని పండితులు చెబుతుంటారు. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి ఇంటి మేడపై పెట్టే వస్తువులు. వాస్తు శాస్త్రం ప్రకారం మేడపై ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల వస్తువులను పెట్టకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* మనలో చాలా మంది ఇంట్లో పనికిరాని, విరిగిపోయిన ఫర్నిచర్‌ను, కుర్చీలను, టేబుళ్లను మేడపై పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మేడపై విరిగిన ఫర్నిచర్‌ ఉంచితే ఆర్థిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

* ఇక ఇంటి నిర్మాణ సమయంలో ఉపయోగించిన కర్రలను అలాగే మేడపై పడేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇంటి మేడపైన వెదురు కర్రలు ఉండకూడదట. వీటివల్ల ఇంట్లో గొడవలు జరిగి కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత దూరమవుతుందని చెబుతున్నారు.

* మేడపై సాధారణంగా కనిపించే వాటిలో పగిలిన కుండలు కూడా ఒకటి. అయితే ఎట్టి పరిస్థితుల్లో మేడపై పగిలిన కుండలను పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుందని అంటున్నారు.

* మేడపై శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురును అక్కడే పెడుతుంటారు. అయితే అలా చేయడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

* ఇంట్లో పాడై పోయిన ఇనుప వస్తువులు, వైర్లను, పనిముట్లు వంటి వాటిని మేడపై పెడుతుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదని నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వాటి వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు.

* టెర్రస్‌పై కుండీల్లో మొక్కలను పెంచడం సర్వసాధారణమైన విషయం అయితే. ఈ కుండీల్లో పెంచుకునే మొక్కల్లో ఎట్టి పరిస్థితుల్లో ముళ్లు ఉండే మొక్కలను పెంచకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల అనారోగ్య సమస్యలతో పాటు, ఇంట్లో అశాంతి నెలకొంటుందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..