Vastu Tips: ఈ దిశలో మనీ ప్లాంట్ నాటుతున్నారా.? లాభం కంటే నష్టమే ఎక్కువ..

|

Apr 01, 2024 | 4:32 PM

వాస్తు శాస్త్రంలో ప్రతీ అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే కాకుండా చివరికి ఇంట్లో నాటే మొక్కల విషయంలో కూడా వాస్తు వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాంటి వాటిలో మనీ ప్లాంట్‌ కూడా ఒకటి. ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడం మంచిదని చాలా మంది విశ్వసిస్తారు. మనీ ప్లాంట్ ఎదుగుతున్న విధంగానే ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని...

Vastu Tips: ఈ దిశలో మనీ ప్లాంట్ నాటుతున్నారా.? లాభం కంటే నష్టమే ఎక్కువ..
Money Plant
Follow us on

వాస్తు శాస్త్రంలో ప్రతీ అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే కాకుండా చివరికి ఇంట్లో నాటే మొక్కల విషయంలో కూడా వాస్తు వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాంటి వాటిలో మనీ ప్లాంట్‌ కూడా ఒకటి. ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడం మంచిదని చాలా మంది విశ్వసిస్తారు. మనీ ప్లాంట్ ఎదుగుతున్న విధంగానే ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని నమ్ముతారు. అయితే ఈ మొక్కను నాటే దిశ కూడా ప్రధానమని పండితులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను ఏ దిశలో నాట కూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఈశాన్య దిశలో మనీ ప్లాంట్‌ను నాటకూడదు. ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టడం వల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈశాన్య దిశ ఎల్లప్పుడూ ఖాళీగానే ఉండాలని చెబుతున్నారు.

* ఇక మనీ ప్లాంట్ ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో నాటాలి. ఈ దిక్కును వినాయకునికి దిక్కుగా భావిస్తారు. ఈ దిశలో మనీ ప్లాంట్‌ను నాటడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.

* వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ పెరిగేకొద్దీ, ఇంటి సభ్యుల పురోగతి కూడా పెరుగుతుంది. మనీ ప్లాంట్ తీగ ఎప్పుడూ నేలను తాకకూడదని గుర్తుంచుకోండి. దీని తీగ తెగితే ధన నష్టం కలుగుతుందని విశ్వసిస్తారు.

* అలాగే మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోకుండా చూడాలని పండితులు చెబుతున్నారు. ఆకులు ఎండిపోయినా లేదా పసుపు రంగులోకి మారినా వెంటనే తుంచేయాలి. ఎండిన మనీ ప్లాంట్ ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తుంది.

* ఇక మనీ ప్లాంట్‌ను ఇంటి బయట ఎప్పుడూ నాటకూడదు. బయటి వ్యక్తులకు ఎక్కువగా కనిపించేలా మనీ ప్లాంట్ ఉండకూడదు. అలా ఉంటే మనీ ప్లాంట్ ఎదుగుదల ఆగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఇది కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటి లోపల నాటాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..