ప్రధాన మంత్రి జన‏ధన్ ఖాతాదారులకు గమనిక.. ఆ లింక్ చేయకపోతే.. రూ.2.30 లక్షలు మిస్సయినట్టే..

|

Feb 08, 2021 | 8:49 AM

ప్రధాన మంత్రి జన‏ధన్ యోజన పథకంలో మీకు అకౌంట్ ఉందా ? అయితే మీ కోసమే ఈ వార్త. 2021 మార్చి 31లోగా ప్రధాన మంత్రి జన‏ధన్ అకౌంట్లకు

ప్రధాన మంత్రి జన‏ధన్ ఖాతాదారులకు గమనిక.. ఆ లింక్ చేయకపోతే.. రూ.2.30 లక్షలు మిస్సయినట్టే..
Follow us on

ప్రధాన మంత్రి జన‏ధన్ యోజన పథకంలో మీకు అకౌంట్ ఉందా ? అయితే మీ కోసమే ఈ వార్త. 2021 మార్చి 31లోగా ప్రధాన మంత్రి జన‏ధన్ అకౌంట్లకు వినియోగదారుల ఆధార్ కార్డు నంబరును అనుసంధానం చేయాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. ప్రతి అకౌంట్‏కు ఆ ఖాతా యొక్క వినియోగదారుడి పాన్ నంబర్ మరియు ఆధార్ నంబర్ మార్చి 31లోపు అనుసంధానం అయి ఉండాలి.. లేకపోతే 2.30 లక్షల రూపాయాల ప్రయోజనాన్ని అందించలేమని స్పష్టం చేసింది.

ప్రధాన్ మంత్రి జన‏ధన్ యోజన ద్వారా ఇప్పటివరకు 41 కోట్లకు పైగా ప్రజలు లబ్ది పొందారు. ఆర్థికంగా చేయూతనిచ్చే ఈ స్కీంకు మొత్తం జన‏ధన్ ఖాతాల సంఖ్య 41.75 కోట్లకు పెరిగింది. 2014లో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ జన‏ధన్ యోజన పథకాన్ని ప్రకటించగా.. అదే ఏడాది ఆగస్టు 28న ఈ స్కీం ప్రారంభమయ్యింది.

జన‏ధన్ స్కీంలో రూ.2.30 భీమా పొందడం..
☞ జన‏ధన్ ఖాతాలో ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతోపాటు రుపే కార్డు అందించబడుతుంది.
☞ ఈ డెబిట్ కార్డులో దాదాపు లక్ష రూపాయాలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ఉచితంగా లభిస్తాయి.
☞ ఓపెన్ జనధన్ ఖాతాలపై ప్రమాద భీమాను 2018లో ఆగస్టు 28 తర్వాత ఆ అమౌంట్ విలువను రూ.2 లక్షలకు పెంచారు.
☞ ఇవే కాకుండా ఈ కార్డులో రూ.30.000 వరకు ఉచిత జీవిత భీమా సౌకర్యం కల్పిస్తుంది. ఈ భీమా 2014 ఆగస్ట్ 15 నుంచి 2015 జనవరి 31 మధ్యలో అకౌంట్స్ ఓపెన్ చేసిన జనధన్ వినియోగదారులకు ఈ అవకాశం లభిస్తుంది.

జనధన్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయడం..
☞ జనధన్ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డును ఆన్ లైన్లో లింక్ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు నెట్ బ్యాంకింగ్‏కు లాగిన్ కావాల్సి ఉంటుంది.
☞ లాగిన్ అయిన తర్వాత మీకు ఆధార్ నంబర్ లింక్ అనే ఆప్షన్ కన్పిస్తుంది.
☞ ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించకపోతే, నేరుగా బ్యాంకుకు వెళ్లి అకౌంటును ఆధార్‏తో లింక్ చేయాలి.
☞ అందుకోసం ఈ పాస్ బుక్, ఆధార్ కార్డు యొక్క జీరాక్స్ కాపీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలావరకు బ్యాంకులు వినియోగదారుల అకౌంట్లకు ఆధార్ తో మేసేజ్ ద్వారా కూడా లింక్ చేస్తున్నాయి.

జనధన్ ఖాతా తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్స్..
☞ జనధన్ ఖాతా ఓపెన్ చేయడానికి.. మీ యొక్క ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వీటితోపాటు కెవైసీకి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి.
☞ ఈ డాక్యుమెంట్స్ లేకపోతే ముందుగా బ్యాంక్ అకౌంటును తెరవవచ్చు. ఇందులో మీ ఒరిజినల్ ఫోటోతోపాటు మీ సంతకం కూడా అవసరం ఉంటుంది.
☞ ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
☞ పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.