Fact Check: పది కోట్ల మందికి మూడు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్..సోషల్ మీడియాలో వైరల్ వార్త.. నిజమెంత?

|

Jun 01, 2021 | 9:15 PM

Fact Check: ఒక పక్క కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తుంటే, మరో పక్క రకరకాల వార్తలు సోషల్ మీడియాను కుమ్మేస్తున్నాయి. కొన్ని కరోనా వచ్చిందా ఈ మందు వాడండి.. ఆ తిండి తినండి.. ఇలా వచ్చి పడుతున్నాయి.

Fact Check: పది కోట్ల మందికి మూడు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్..సోషల్ మీడియాలో వైరల్ వార్త.. నిజమెంత?
Fact Check
Follow us on

Fact Check: ఒక పక్క కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తుంటే, మరో పక్క రకరకాల వార్తలు సోషల్ మీడియాను కుమ్మేస్తున్నాయి. కొన్ని కరోనా వచ్చిందా ఈ మందు వాడండి.. ఆ తిండి తినండి.. ఇలా వచ్చి పడుతున్నాయి. మరికొన్ని కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా డబ్బులు ఇస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు ఇస్తోంది.. ఇలాంటి వార్తలు విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. ఇక ఒక్కోసారి మరీ విచిత్రమైన ఆఫర్లను ప్రకటించేస్తున్నారు నెట్టింట్లో. తాజాగా అలాంటి వార్త ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం పది కోట్ల మంది ఇంటర్నెట్ విజ్యోగా దారులకు ఉచితంగా ఇంటర్నెట్ ఇవ్వబోతోంది అంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, అసలు అటువంటి పథకం కానీ, ఆలోచన కానీ కేంద్ర ప్రభుత్వం ఏమీ వెల్లడించలేదు. ఈ విషయంపై పీఐబీ క్లారిటీ ఇస్తూ ఒక ట్వీట్ చేసింది. ఈ ప్రచారం పూర్తిగా తప్పని, ఇటువంటి పథకం ఏదీ లేదనీ ఆ ట్వీట్ లో స్పష్టం చేశారు. పీఐబీ చేసిన ట్వీట్ ఇక్కడ మీరు చూడొచ్చు.

”వాట్సాప్ సందేశం భారత ప్రభుత్వం 100 మిలియన్ల వినియోగదారులకు 3 నెలలు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని ఒక అబద్ధపు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం, లింక్ నకిలీ. భారత ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. అటువంటి నకిలీ వెబ్‌సైట్ పట్ల జాగ్రత్త వహించండి.” అంటూ పీఐబీ హెచ్చరిస్తోంది.

అసలే కరోనా దెబ్బతో అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఇలా ఫేక్ వార్తలు ఇష్టం వచ్చినట్టు షేర్ చేస్తున్నారు. ఇటువంటి వాటిలో నిజం ఉండదని అందరూ అర్ధం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి పథకం ప్రభుత్వం పెడితే జాతీయ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తారు. ఇలా సోషల్ మీడియా చెవిలో చెప్పి అందరికీ చెప్పమని చెప్పారు. ఏదైనా ఒక విషయాన్ని షేర్ చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. లాజికల్ గా ఆలోచిస్తే మీకు వచ్చిన విషయం నిజమో అబద్ధమో మీకే అర్ధం అయిపోతుంది. చిన్న చిన్న పథకాలకే పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం చేసే ప్రభుత్వం ఇటువంటి పెద్ద పథకం పెడితే వదిలేస్తుందా? ఇక మీరు ఇటువంటి వార్తల్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే.. మీ ఫోను పని అయిపోయినట్లే. ఒక్కోసారి మీ బ్యాంకు ఎకౌంట్లు కూడా జీరో అయిపోతాయి. జాగ్రత్తగా ఉండండి.. అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ED Chargesheet: లెక్క తేలుతోంది.. అక్రమాల పుట్ట పగులుతోంది.. ఆనాటి నోట్ల రద్దు స్కామ్‌ తాజాగా బట్టబయలు.. ఈడీ చార్జిషీట్ దాఖలు..!

Chiranjeevi Oxygen Bank: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కు చిన్నారి అన్షి లక్ష రూపాయల విరాళం…