
ప్రకృతి అంటే మనకు గుర్తొచ్చేది ప్రశాంతత, పచ్చదనం. కానీ ఆ పచ్చదనం వెనుక ప్రాణాంతకమైన విషం దాగి ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? కొన్ని మొక్కలు చూడటానికి ఎంతో అందంగా, అమాయకంగా కనిపిస్తాయి. కానీ వాటిని ఒక్కసారి తాకినా లేదా వాటి నీడలో నిలబడినా మీ ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు. వర్షపు చినుకులను సైతం యాసిడ్‌లా మార్చే చెట్ల నుండి మనిషిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించే నొప్పిని ఇచ్చే మొక్కల వరకు.. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన 7 మరణ వృక్షాల గురించి షాకింగ్ నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దీనిని చూస్తే చిన్న ఆపిల్ చెట్టులా కనిపిస్తుంది. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు. దీని పండు తింటే మరణం ఖాయం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వర్షం పడుతున్నప్పుడు ఈ చెట్టు కింద నిలబడితే ఆకులపై నుండి పడే నీటి చుక్కలు మీ చర్మాన్ని కాల్చేస్తాయి.
ఆస్ట్రేలియాలో కనిపించే ఈ మొక్క ఆకులు తగిలితే కలిగే నొప్పి భరించలేం. గతంలో దీని నొప్పిని భరించలేక గుర్రాలు కొండపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అందుకే దీనిని సూసైడ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు.
ఇది సాధారణ మొక్కలాగే కనిపిస్తుంది. కానీ దీనిలోని ఉరుషియోల్ అనే నూనె చర్మానికి తగిలితే తీవ్రమైన దురద, దద్దుర్లు వస్తాయి. ఇది చూడటానికి అమాయకంగా ఉన్నా చాలా మొండిది.
మెక్సికో, అమెరికాలో కనిపించే ఈ మొక్కకు అందమైన పువ్వులు ఉంటాయి. కానీ దీని నిండా ఉండే ముళ్ళు చర్మంలోకి గుచ్చుకుని, భయంకరమైన వాపును కలిగించే రసాయనాలను విడుదల చేస్తాయి. ఆ మంట తగ్గడానికి గంటలు పడుతుంది.
దక్షిణాఫ్రికాలో ఉండే ఈ మొక్కను ఆఫ్రికన్ పాయిజన్ ఐవీ అంటారు. దీని నుండి వచ్చే తెల్లటి ద్రవం చర్మంపై పడితే బొబ్బలు వస్తాయి. అది ఆరిపోయిన తర్వాత చర్మం నల్లగా మారిపోతుంది.
మన పొలాల గట్ల వెంబడి సాధారణంగా కనిపించే ఈ మొక్క ఆకులపై సన్నని సూదుల్లాంటి ముళ్ళు ఉంటాయి. ఇవి గుచ్చుకోగానే ఫార్మిక్ ఆమ్లం చర్మంలోకి వెళ్తుంది. వెంటనే తేనెటీగ కుట్టినట్లుగా మంట, దురద మొదలవుతుంది.
క్యారెట్ మొక్కలా, తెల్లటి పువ్వులతో అందంగా ఉండే ఈ చెట్టు చాలా ప్రమాదకరమైనది. దీని రసం చర్మానికి అంటుకుని, దానిపై సూర్యకాంతి పడితే చర్మం కాలిపోయి బొబ్బలు వస్తాయి. పొరపాటున ఈ రసం కళ్ళలో పడితే శాశ్వతంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది.