Ants Problem: ఇంట్లో చీమల బెడద ఎక్కువగా ఉందా..? కెమికల్స్ లేకుండానే సులభంగా తప్పించుకోండిలా..

|

May 15, 2023 | 7:30 AM

Remedies for Ants: చాలా మంది ఇళ్లల్లో కిచెన్, లేదా ఆహార పదార్థాలు ఉన్న ప్రదేశంలో చీమల బెడద విపరీతంగా ఉంటుంది. ఇక ఈ చీమల బారి నుంచి బయట పడడానికి అనేక రకాల స్ప్రేలు వాడుతుంటారు. కానీ ఫలితాలు ఉండక..

Ants Problem: ఇంట్లో చీమల బెడద ఎక్కువగా ఉందా..? కెమికల్స్ లేకుండానే సులభంగా తప్పించుకోండిలా..
Ants
Follow us on

Remedies for Ants: చాలా మంది ఇళ్లల్లో కిచెన్, లేదా ఆహార పదార్థాలు ఉన్న ప్రదేశంలో చీమల బెడద విపరీతంగా ఉంటుంది. ఇక ఈ చీమల బారి నుంచి బయట పడడానికి అనేక రకాల స్ప్రేలు వాడుతుంటారు. కానీ ఫలితాలు ఉండక విసుగెత్తిపోతుంటారు. అలాంటివారి కోసమే చీమల బారి నుంచి తప్పించుకోవడానికి చక్కని చిట్కాలను తీసుకొచ్చాం.. ఈ చిట్కాల కోసం మీరు ఎటువంటి కెమికల్స్ వాడే అవసరం లేదు.. కేవలం వంటగదిలోని పదార్థాలను సరిగ్గా వాడితే చాలు..

  1. చీమల్ని తరిమి కొట్టడానికి నల్ల మిరియాలు మెరుగ్గా సహాయపడతాయి. అవును, మిరియాల నుంచి వచ్చే ఘాటుకు చీమలు పారిపోవడం ఖాయం. అందుకోసం చీమల మందుకి బదులుగా కిచెన్‌లో మిరియాలు అక్కడక్కడా కొన్ని పెడితే సరేసరి.
  2. చీమలను వదిలించుకోవడానికి రెండు కప్పుల నీళ్లలో కొంచెం పెప్పర్‌మెంట్ ఆయిల్‌ను కలిపి ఒక బాటిల్లో పోసి చీమలు ఉన్నచోట స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది స్ప్రే చేసేటప్పుడు మీ ఇంట్లో ఉండే పెట్స్‌ని దూరంగా పెట్టడం మరిచిపోకండి.
  3. అలాగే రెండు కప్పుల నీటిలో ట్రీ ఆయిల్‌ను కలిపి స్ప్రే చేసినా, కాటన్ బాల్స్‌ని ఈ వాటర్‌లో ముంచి కిచెన్‌లో ఉంచినా మంచి రిజల్ట్ ఉంటుంది.
  4. చీమల నుంచి ఉపశమనం పొందడానికి దాల్చిన చెక్క కూడా సహాయపడుతుంది. దాల్చిన చెక్క ఆయిల్‌లో కాటన్ బాల్స్‌ని ముంచి తీసి చీమలు తిరిగే ప్రదేశంలో పెడితే అవి రాకుండా ఉంటాయి.
  5. ఇంకా వైట్ వెనిగర్‌ని కూడా చీమలు ఉండే చోట స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
  6. అంతేకాక వేప నూనెను రెండు కప్పుల నీటిలో వేసి బాటిల్లో పోసి స్ప్రే చేసినా కూడా చీమలు మీ దరిచేరవు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..