ఫిక్షనల్‌ స్టోరీ జాంబీ వైరస్‌.. తొందరలోనే నిజం కాబోతుందని శాస్త్రవేత్తల వార్నింగ్స్‌

కరోనా... ఈ పేరెత్తితేనే... వెన్నులో వణుకుపుడుతుంది. కంటికి కనిపించని వైరస్‌.. ప్రపంచాన్ని కకావికలం చేసింది. ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ.. మరణమృదంగం మోగించింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కరోనా కా బాప్‌.. జాంబీ వైరస్‌ పుట్టుకొచ్చింది. అది సోకిన వెంటనే మనుషులు రాక్షసుల్లా మారిపోతారు. విచక్షణ, ఆలోచించే జ్ఞానం కోల్పోయి మృగాల్లా మారిపోతారు. వేల ఏళ్లుగా మంచు కింద కప్పబడిన జాంబీ వైరస్... ఇప్పుడు బయటకు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల వార్నింగ్స్‌.. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది.

ఫిక్షనల్‌ స్టోరీ జాంబీ వైరస్‌.. తొందరలోనే నిజం కాబోతుందని శాస్త్రవేత్తల వార్నింగ్స్‌
Zombie Virus

Updated on: Jan 24, 2024 | 9:53 PM

కరోనా వచ్చిన తర్వాత వైరస్‌ అనే మాట వినగానే జనం భయపడుతున్న పరిస్థితి. కంటికి కనిపించని కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికించిన విషయం ఇప్పట్లో ఎవరు మర్చిపోగలరు. 2019 నవంబర్‌ నెలలో చైనాలోని వూహాన్‌ నగరం నుంచి ప్రారంభమై.. ప్రపంచంపై పంజా విసింది. ప్రపంచ దేశాలు విలవిల్లాడిపోయాయి. ఎక్కడ చూసిన బీతావహ వాతావరణమే కనిపించింది. ఆంక్షలను గాలికి వదిలేసి.. నిబంధనలకు నీళ్లు వదిలేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన దేశాలు.. తగిన మూల్యం చెల్లించుకున్నాయి. చివరకు.. ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌తో పాటు.. వ్యాక్సిన్‌తో…. కరోనా వైరస్‌ను కాస్త కట్టడి చేశారు.

మృత్యువు కౌగిలి నుంచి తప్పించుకుని.. సాధారణ జీవనంలో అడుగు పెట్టాం.. ఇక.. కరోనా ఖతం అయిపోతుందిలే..! హమ్మయ్య…! కరోనా రక్కసి కోరల నుంచి తప్పించుకున్నామని అందరూ ఆనంద పడుతున్నారు. అయితే.. ఇప్పుడు అందరూ షాక్‌ అయ్యే న్యూస్‌ తెరపైకి వచ్చింది. మళ్లీ భయాందోళనలు సృష్టించే వాస్తవం ముందుకు వచ్చింది. ఇప్పుడు కొత్తగా జాంబీ వైరస్‌ భయాందోళనలు రేపుతోంది.

48 వేల సంవత్సరాలుగా ఆర్కిటిక్ మంచు కింద కప్పబడిన జాంబీ వైరస్… ఇప్పుడు బయటకు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఎయిక్స్ మార్సిల్లే యూనివర్సిటీ పరిశోధకులు. ఈ జాంబీ వైరస్ బయటకు వస్తే.. పోలియో తరహాలో జనం అనారోగ్యం బారిన పడతారని.. మానవాళికి ముప్పు తప్పదని గట్టిగానే వార్నింగ్‌ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు.

గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఆర్కిటిక్‌లోని మంచు వేగంగా కరిగిపోతుందని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్కిటిక్‌ మంచు కరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదాలపై పరిశోధన చేపట్టిన ఎయిక్స్‌ మార్సిల్లే పరిశోధనలో.. షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వేల ఏళ్ల క్రితం ఆర్కిటిక్‌ మంచులో గడ్డకట్టుకుపోయిన.. ప్రమాదకరమైన వైరస్‌లు ఇంకా సజీవంగానే ఉన్నాయన్న విషయం వారి పరిశోధనల్లో వెల్లడైంది. భూతాపం కారణంగా మంచు కరిగిపోవడంతో.. ఇప్పుడు ఆ వైరస్‌లు బయటకు వస్తున్నాయని తెలిసింది.

రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతంలో కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన సైంటిస్టులు.. 13 కొత్త తరహా వైరస్‌లను 2022లో గుర్తించారు. వీటిపై తాజాగా పరిశోధనలు జరిపిన సైంటిస్టులు.. వీటిలో 48,500 ఏళ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన జాంబీ తరహా వైరస్‌లు కూడా ఉన్నాయని గుర్తించారు. ఈ వైరస్‌లు ఇంకా సజీవంగానే ఉన్నాయని.. తొందరలోనే ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

కొన్ని వైరస్‌లు… వేల సంవత్సరాలు మంచులో గడ్డకట్టి సజీవంగానే ఉంటాయని.. అందులో జాంబీ తరహా వైరస్‌లు 48 వేల 500 సంవత్సరాలుగా.. మంచులో సజీవంగా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఆ మంచు కరిగి.. నీళ్లుగా మారి.. ఆ నీళ్ల ద్వారా వైరస్ జనంలోకి వస్తే.. పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. మంచు కరగటం ద్వారా బయటకు వచ్చే వైరస్.. వాతావరణంలో కలిసి.. గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. ఈ జాంబీ వైరస్‌లు విజృంభిస్తే కరోనా కంటే పెను విలయం తప్పదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

మంచు ఖండంలోని ఇంధన నిక్షేపాల కోసం.. వేల అడుగుల లోతుకు డ్రిల్లింగ్ చేస్తున్నారని.. దీని వల్ల కూడా జాంబీ వైరస్ లు బయటకు వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు వార్నింగ్ చేస్తున్నారు. ఈ జాంబీ వైరస్‌లు బయటకొస్తే పురాతన పోలయో తరహా అనారోగ్యాలు మళ్లీ వచ్చే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఏదేమైనా.. కరోనా మిగిల్చిన విషాదం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే.. మరో డేంజరస్‌ వైరస్‌ జాంబీ పంజా విసిరేందుకు రెడీ అవుతోందనే వార్తలు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..