ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వే 2532 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 6 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం మార్కుల ఆధారంగానే ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై, పుణె, నాగ్ పూర్, భుసావల్, షోలాపూర్ డివిజన్లలలో పనిచేయాల్సి ఉంటుంది.
ఇందులో క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో, వ్యాగన్ వాడి బందర్, ముంబై కల్యాన్ డీజిల్ షెడ్, కుర్లా డీజిల్ షెడ్, సీనియర్ డీ కుర్లా, టీఎండబ్ల్యూ నాసిక్ రోడు, డీజిల్ లోకోషెడ్ , ఎలక్ట్రిక్ లోకోషెడ్ ఇతర విభాగాల్లో మొత్తం 2532 ఖాళీలున్నాయి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి పదో తరగతి లేదా దానికి సమానమైన 10+2 విధానంలో ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్టీవీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ళ లోపు ఉండాలి. టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలను ఫిబ్రవరి 6 నుంచి మార్చి 5 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలను https://www.rrccr.com/ వెబ్సైట్లో చూడొచ్చు.
Also Read:
విద్యార్థులకు గుడ్న్యూస్.. ఉన్నత విద్య కోసం రూ.20 లక్షల స్కాలర్ షిప్.. చివరి తేదీ ఎప్పుడంటే..