గర్భస్రావంతో బాధపడుతున్న మహిళలకు అద్భుతమైన చిట్కాలు.. ఆరోగ్యకరమైన గర్భధారణకు సులభమైన మార్గాలు

గర్భస్రావం అనేది జీవితంలోని చెడు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దీని వల్ల స్త్రీలలో ఆసంతృప్తి వ్యక్తం అవుతుంటుంది. 'నేను మళ్లీ తల్లిని కాగలనా', 'నాకు సంతానోత్పత్తి చికిత్స అవసరమా..

గర్భస్రావంతో బాధపడుతున్న మహిళలకు అద్భుతమైన చిట్కాలు.. ఆరోగ్యకరమైన గర్భధారణకు సులభమైన మార్గాలు
Healthy Pregnancy Tips After Miscarriage

Updated on: Feb 07, 2023 | 6:00 AM

గర్భస్రావం అనేది జీవితంలోని చెడు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దీని వల్ల స్త్రీలలో ఆసంతృప్తి వ్యక్తం అవుతుంటుంది. ‘నేను మళ్లీ తల్లిని కాగలనా’, ‘నాకు సంతానోత్పత్తి చికిత్స అవసరమా ‘ వంటి ప్రశ్నలు గర్భస్రావం అయిన స్త్రీ మనస్సులో తలెత్తుతాయి . గర్భస్రావం ఎదుర్కొంటున్న జంట మానసికంగా కలవరపడతారు. మళ్లీ గర్భం దాల్చడానికి ముందు మానసికంగా దృఢంగా ఉండడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒకసారి గర్భస్రావం జరిగితే మళ్లీ గర్భం రాదని కాదు. అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న స్త్రీ మళ్లీ తల్లి కావాలనుకునే లేదా ప్రణాళికలో ఉన్నట్లయితే ఆమె ఈ ఆరోగ్యకరమైన గర్భధారణ చిట్కాలను తప్పక పాటించాలి.

మళ్లీ గర్భం దాల్చాలని తొందరపడకండి:

గర్భస్రావం జరిగిన కొన్ని రోజుల తర్వాత పొరపాటున కూడా గర్భధారణను ప్లాన్ చేయవద్దు. కనీసం మూడు నెలల పాటు తన పీరియడ్స్ సైకిల్‌ను గమనించిన తర్వాతే గర్భం గురించి ఆలోచించాలని చెబుతారు నిపుణులు.

ఆరోగ్యకరమైన జీవనశైలి:

జీవనశైలికి సంబంధించిన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం ఆరోగ్యకరమైన గర్భధారణకు దారితీస్తుంది. అందుకే ఆకు కూరగాయలు, పప్పులు, పండ్లు, ఐరన్ రిచ్ ఫుడ్స్ కలిగి ఉన్న సమతుల్య ఆహారాలను తరచూగా తీసుకోవడం ముఖ్యం.

మధుమేహాం ఉన్నవారు జాగ్రత్త..

షుగర్ పేషెంట్ గర్భధారణకు ముందు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం అవసరం. అధిక రక్తం లేదా తక్కువ రక్త చక్కెర స్థాయి తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరం. షుగర్‌కి సంబంధించిన పొరపాటు వల్ల మళ్లీ గర్భస్రావం అయ్యే పరిస్థితి వస్తుంది. ఆరోగ్య నిపుణుడి లేదా నిపుణుడి సలహా మేరకు షుగర్‌కి సంబంధించిన పరీక్షలు చేయించుకుని మధుమేహాన్ని నియంత్రించే ఆహారం తీసుకోండి.

యోగాతో అద్భుతమైన ఫలితాలు

గర్భస్రావం తరువాత స్త్రీ శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతుంటుంది. ఒత్తిడి, అలసటకు యోగా నివారణగా పని చేస్తుంది. యోగా మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి