Diabetes Symptoms: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే డయాబెటిస్‌ కావచ్చు!

ఈ రోజుల్లో డయాబెటిస్‌లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో మంది డయాబెటిస్‌ బారిన పడి వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు..

Diabetes Symptoms: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే డయాబెటిస్‌ కావచ్చు!
Diabetes symptoms
Follow us

|

Updated on: Feb 07, 2023 | 6:20 AM

ఈ రోజుల్లో డయాబెటిస్‌లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో మంది డయాబెటిస్‌ బారిన పడి వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. ఒక సారి డయాబెటిస్‌ వచ్చిందంటే చాలు జీవనశైలిలో మార్పులు చేసుకుని అదుపులో ఉంచుకోవాలి తప్ప పూర్తిగా నయం చేసుకోలేమని గుర్తించుకోవాలి.

డయాబెటిస్‌ అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి మనలో కనిపించడం మొదలుకాగానే అనేక భాగాలను దెబ్బతినడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ కారణంగా కళ్ళు బలహీనంగా మారవచ్చు. మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులు కూడా వస్తాయి. ఇదే సమయంలో చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు.

  1. మూత్రవిసర్జన: మన శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌తో పాటు పొడి చర్మం సమస్య ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి నిర్ధారణకు ముందే మన చర్మంపై కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను సూచిస్తాయి. ఇటువంటి లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే డయాబెటిస్‌ను నివారించుకోవచ్చు.
  2. గొంతు లేదా చంకల్లో నల్లటి ప్యాచెస్: గొంతు లేదా చంకల్లో నల్లటి ప్యాచెస్ ఏర్పడుతాయి. వీటిని చేతితో తాకినప్పుడు వెల్వెట్ మాదిరిగా అనిపిస్తాయి. ఇవి మధుమేహం రావడానికి ముందు లక్షణాలని గుర్తించాలి. ఈ లక్షణం కనిపించింది అంటే మీ రక్తంలో ఇన్సులిన్ పెరిగినట్లు సంకేతాలే.
  3. ఇవి కూడా చదవండి
  4. చర్మంపై మచ్చలు: చర్మంపై దురద లేదా నొప్పి లేదా చర్మంపై పెరిగిన మొటిమలు ఏర్పడతాయి. తర్వాత మొల్లమెల్లగా పసుపు, ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి కూడా మధుమేహానికి ముందస్తు లక్షణాలేనని గుర్తించాలి. దీని కోసం షుగర్ చెక్ చేసుకోవడం ఎంతో అవసరం. ఇలా గుర్తించిన వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించి తగు సలహాలు కూడా తీసుకోవాలి.
  5. నయంకాని గాయాలు: ఒక వ్యక్తి రక్తంలో చక్కెరల స్థాయి చాలా కాలం పాటు ఎక్కువగా ఉన్నట్లయితే.. నరాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రక్త ప్రసరణలో సమస్యలు కూడా వస్తాయి. నరాలు దెబ్బతినడం వల్ల చర్మంపై ఏదైనా గాయమైతే త్వరగా నయం కాదు. ఇలాంటి సమస్య కనిపించగానే వెంటనే వైద్యున్ని సంప్రదించడం బెటర్‌.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి