Women Health: బరువు తగ్గాలనుకునే మహిళలు ఈ వ్యాయామం అస్సలు చేయకూడదు.. అదేంటో తెలుసా?

అధిక బరువు సమస్యతో బాధపడుతున్న మహిళలు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేసి బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తారు. కానీ చాలామందికి ఈ పద్ధతుల్లో దక్కే ఫలితం మాత్రం తక్కువే. ఎందుకంటే కీళ్ల స్థిరత్వం దెబ్బతినడం వల్ల అధిక బరువు సమస్య పరిష్కారమవకపోగా కొత్త ఆరోగ్య

Women Health: బరువు తగ్గాలనుకునే మహిళలు ఈ వ్యాయామం అస్సలు చేయకూడదు.. అదేంటో తెలుసా?
Exercise

Updated on: Nov 13, 2025 | 9:58 PM

అధిక బరువు సమస్యతో బాధపడుతున్న మహిళలు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేసి బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తారు. కానీ చాలామందికి ఈ పద్ధతుల్లో దక్కే ఫలితం మాత్రం తక్కువే. ఎందుకంటే కీళ్ల స్థిరత్వం దెబ్బతినడం వల్ల అధిక బరువు సమస్య పరిష్కారమవకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయంటున్నారు నిపుణులు. వ్యాయామం చేయడం మొదలుపెట్టే ముందు నిపుణుల సలహాతో శరీరానికి తగినదాన్ని ఎంచుకుని క్రమం తప్పకుండా చేయడం వల్ల అధిక బరువు సమస్యను అతిక్రమించవచ్చంటున్నారు.

ఇటీవల డాక్టర్ మల్హార్ గన్లా (డయాబెటిస్ & ఒబెసిటీ రివర్సల్ స్పెషలిస్ట్) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. అధిక కొవ్వు శాతం ఉన్న మహిళలు ముందుగా కీళ్లను బలోపేతం చేయాలి. శరీరం ఒక యూనిఫైడ్ సిస్టమ్‌లా పనిచేసేలా చూసుకోవాలి. లేకపోతే వాకింగ్, రన్నింగ్, వెయిట్ ట్రైనింగ్ చేసినా కీళ్లపై ఒత్తిడి పడుతుంది. మోకాళ్లు, చీలమండలు దెబ్బతిని ఆర్థరైటిస్ సమస్యలు మొదలవుతాయని హెచ్చరిస్తున్నారు.

చాలా మంది మహిళలు మొబిలిటీ ఎక్సర్‌సైజ్‌లు (నడక, ఈత, పరుగు) చేస్తే చాలు అనుకుంటారు. కానీ ముందుగా స్టెబిలిటీ ఎక్సర్‌సైజ్‌లు (ప్లాంక్, గ్లూట్ బ్రిడ్జ్, కోర్ స్టెబిలైజేషన్ వంటివి) చేయకపోతే కండరాలు, ఎముకల్లో నొప్పులు తప్పవంటున్నారు. చాలామంది ఈ విషయం తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు.

Exercise2

రోజుకి 300–500 కేలరీలు తక్కువ తీసుకుంటే వారానికి 0.5–0.75 కేజీలు సురక్షితంగా తగ్గుతారు. ఇది శాశ్వత ఫలితాలనిస్తుంది. ప్రతి భోజనంలో 25–35 గ్రాముల ప్రోటీన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఉడికించిన గుడ్లు (3–4), చికెన్ బ్రెస్ట్ (100 గ్రా), పెసర్లు, పనీర్, గ్రీక్ యోగర్ట్, పాలకూర, శనగలు కలిపిన సలాడ్ వంటి వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వైట్ రైస్, మైదా, బ్రెడ్ బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్, రాగి, జొన్న, కంది, సజ్జలు, బార్లీ తీసుకోవాలి.

రోజుకి 3–4 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. ఉదయం ఖాళీ కడుపున గ్రీన్ టీ లేదా లెమన్ వాటర్ తాగితే మెటబాలిజం 10–15% పెరుగుతుంది. వ్యాయమాన్ని ప్రారంభించే ముందు 4-6 వారాలు స్టెబిలిటీ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. కీళ్లు బలంగా అయిన తర్వాత మొబిలిటీ & స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌కి వెళ్లాలి. ప్రోటీన్ అధికంగా తీసుకుని, తగినంత నిద్ర పోవాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అధికబరువు సమస్యను తప్పకుండా అధిగమించవచ్చు.