ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఏమౌతుందో తెలుసా..?

మన ఫుడ్ డైట్ లో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఖర్జూరాలు ముఖ్యమైనవి. ఇవి శక్తినిచ్చే పండ్లు మాత్రమే కాదు.. పోషకాల గని కూడా. ముఖ్యంగా వాటిని నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చు.

ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఏమౌతుందో తెలుసా..?
Dates

Updated on: Jun 28, 2025 | 2:23 PM

ఖర్జూరాల్లో ఫైబర్, విటమిన్ B సమూహాలు (B1, B2, B3, B5), విటమిన్ A, C, అలాగే ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖర్జూరాల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల పేగుల పనితీరు బాగుంటుంది. ఇది మలబద్ధకం రాకుండా సహాయపడుతుంది.

ఇందులో ఉన్న ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇది అనీమియా సమస్యను తగ్గిస్తుంది. ఎప్పుడూ అలసటగా ఉండే వారు ఖర్జూరాలను తినడం వల్ల శక్తిని పొందవచ్చు.

విటమిన్ సి, సెలీనియం వంటి పోషకాలు మన శరీర రక్షణ వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) పనితీరుకు చాలా అవసరం. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల వైరస్‌ లు, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

నానబెట్టిన ఖర్జూరాల్లో ఉన్న మెగ్నీషియం, రాగి, మాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకలు బలంగా ఉండటానికి అవసరం. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండాలంటే.. ముందుగానే ఖర్జూరాలు ఆహారంలో చేర్చడం మంచిది.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షించి.. మతిమరుపు, అల్జీమర్స్ వంటి నరాల సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

నానబెట్టిన ఖర్జూరాల్లో ఉండే పోషకాలు చర్మ కణాల పునరుత్పత్తికి తోడ్పడతాయి. శరీరాన్ని లోపల నుండి శుభ్రపరచి.. చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి ఖర్జూరాల్లో ఉంది.

రాత్రి సమయంలో 3 నుండి 4 ఖర్జూరాలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తినడం చాలా మంచిది. నానబెట్టిన నీటిని కూడా తాగవచ్చు. ఇది శరీరాన్ని డిటాక్స్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)