
చర్మంపై తెల్లటి మచ్చలు కనిపించడం ప్రారంభమై, క్రమంగా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే పరిస్థితిని బొల్లి వ్యాధి (విటిలిగో) అంటారు. ఇది ముఖం, కళ్ల చుట్టూ, పెదవుల పరిసరాలు, చేతులు, వేళ్లు, మోచేతులు, మోకాళ్లు, పాదాలు, జననేంద్రియాల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో సుమారు 0.5 నుంచి 2 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బొల్లి ఏ వయస్సులోనైనా రావచ్చు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినైనా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాధికి ఒకే ఒక్క ఖచ్చితమైన కారణం ఉందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. పలు జీవశాస్త్ర, జన్యు, పర్యావరణ అంశాలు కలిసి దీనికి కారణమవుతాయని భావిస్తున్నారు. సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ కూడా విటిలిగో వ్యాధి బాధితుడే. ఈ వ్యాధిని కప్పి పుచ్చుకోవడానికి ఆయన ఎప్పుడూ అధిక మేకప్ తో కనిపించేవాడు.
ఇది పూర్తిగా తప్పు. బొల్లి ఒకరి నుంచి మరొకరికి స్పర్శ ద్వారా, కలిసి భోజనం చేయడం ద్వారా, బట్టలు పంచుకోవడం ద్వారా లేదా రక్తం ద్వారా వ్యాపించదు.
బొల్లి ఒక వైద్యపరమైన చర్మవ్యాధి మాత్రమే. దీనికి పూర్వజన్మ, శాపాలు లేదా మూఢనమ్మకాలతో ఎలాంటి సంబంధం లేదు.
ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చేపలు, పాలు కలిసి తీసుకోవడం వల్ల బొల్లి వస్తుందని నిరూపించే పరిశోధనలు లేవు.
బొల్లి క్యాన్సర్ కాదు. ఇది ప్రాణాలకు ముప్పు కలిగించదు. శరీరంలోని ఇతర అవయవాలకు నేరుగా హాని చేయదు.
బొల్లి వ్యాధి ఉన్నవారు సామాజిక వివక్ష, అపోహలు, మానసిక ఒత్తిడికి గురికాకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటే సాధారణ జీవితం గడపవచ్చు. ఆధునిక వైద్యంలో మందులు, ఫోటోథెరపీ, ఇతర చికిత్సా విధానాల ద్వారా వ్యాధిని నియంత్రించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బొల్లి అంటువ్యాధి కాదు. ఇది ఎవరి తప్పూ కాదు. సరైన అవగాహన, సమయానికి చికిత్స, కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే ఈ వ్యాధిని సమర్థంగా ఎదుర్కోవచ్చు.
సమాధానం: మన చర్మం రంగు మెలనిన్ అనే పిగ్మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ మెలనిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను మెలనోసైట్స్ అంటారు. కొన్ని కారణాల వల్ల ఈ కణాలు చనిపోయినపుడు లేదా పనిచేయడం ఆపినప్పుడు చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ పరిస్థితినే బొల్లి వ్యాధి లేదా విటిలిగో అంటారు.
సమాధానం: తల వెంట్రుకలు తెల్లబడటం, కనుబొమ్మలు, గడ్డం వెంట్రుకలు తెల్లబడటం, నోటి లోపలి భాగం తెలుపు రంగులోకి మారడం జరుగుతుంది.
సమాధానం: బొల్లి (విటిలిగో) వచ్చిన ప్రాంతంలో సాధారణంగా నొప్పిగానీ, దురద గానీ ఉండదు. అయితే కొందరిలో ప్రారంభ దశలో స్వల్పంగా దురద ఉంటుంది.
సమాధానం: వుడ్ ల్యాంప్ పరీక్ష, చర్మ బయాప్సీ చేసి బొల్లి వ్యాధి నిర్ధారణ చేస్తారు.
సమాధానం: బొల్లి వ్యాధికి ప్రస్తుతం స్టెరాయిడ్ క్రీములు, కాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్లు వంటి మందులు ఉపయోగిస్తారు. అలాగే న్యారో బ్యాండ్ అల్ట్రావయొలెట్-బి (NB-UVB) అనే ఫోటోథెరపి చికిత్స కూడా అందుబాటులో ఉంది. ఈ చికిత్స ద్వారా మెలనోసైట్స్ తిరిగి పనిచేసేలా ప్రేరేపిస్తారు. దీంతో చర్మం రంగు సాధారణ స్థితికి చేరుకుంది. మెలనోసైట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, స్కిన్ గ్రాఫ్టింగ్ వంటి విధానాలు కూడా చికిత్సలో ఉపయోగించవచ్చు. అయితే ఈ చికిత్స కొన్ని నెలల నుంచి ఏళ్ల వరకు ఉంటుంది. సుదీర్ఘకాలం వైద్యం తీసుకోవాల్సి వస్తుంది.