Telugu News Health What to Know About the Uses, Benefits, and Side Effects of Fenugreek
Health Tips: 2 వారాల పాటు మెంతులు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
Health Tips: మెంతి గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కడుపులో చికాకు, మలబద్ధకం తదితర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అందుకే మెంతిగింజలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మెంతులు గింజలను..
Health Tips: మెంతులు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. మెంతుల్లోని ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్-డి, విటమిన్- సి తదితర పోషకాలు ఉంటాయని, మెంతులో ఆరోగ్యానికి ఎంతో మంచివని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అయితే వరుసగా రెండు వారాల పాటు మెంతులు తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తహీనతను తొలగిస్తుంది: మెంతి గింజలు శరీరంలోని రక్తహీనతను తొలగించడంలో బాగా పని చేస్తాయి. ఇందులో కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఔషధమని నిపుణులు చెబుతున్నారు. మెంతులు పేగుల్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు పని చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
జీర్ణక్రియ: మెంతి గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కడుపులో చికాకు, మలబద్ధకం తదితర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అందుకే మెంతిగింజలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మెంతులు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తింటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.
అధికం తీసుకుంటే కూడా ప్రమాదమేనట: మెంతులను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అలెర్జీ వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొంతమందిలో విరోచనాలు, వికారం, తల తిరగడం వంటి సమస్యలు కనిపించవచ్చు.
అలర్జీ ఉన్నవారు: అలెర్జీలు ఉన్న వారు మెంతి గింజలు తినే ముందు వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)