Curd Health: ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంతో.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అయితే, ఆరోగ్యానికి సంబంధించి మంచిగా ప్రోటిన్లు, విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. ఇలాంటి ఆహారంలో పాలు ఒకటి.. పాలలో ఎన్నో ప్రోటిన్లు ఉన్నాయి. అయితే, పాలు, దానితో చేసిన ఆహార పదార్థాలు ఏవైనా ఎల్లప్పుడూ ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ముఖ్యంగా పెరుగు.. కొంతమంది ఆహారంతో పాటు పెరుగును ఖచ్చితంగా తింటారు. పెరుగులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. కాబట్టి పెరుగు తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. దహీ వడా, రైతా వంటి పెరుగుతో చేసిన వివిధ రకాల వంటకాలను చాలా మంది ఎంతో ఉత్సాహంగా తింటారు. అంతేకాకుండా.. మజ్జిగను కూడా తీసుకుంటారు. ఇలా.. ప్రతిరోజూ పెరుగు తినడానికి ఇష్టపడతారు.
వాస్తవానికి పెరుగులో చాలా విటమిన్లు, మినరల్స్ దాగున్నాయి. అందుకే ఇది ఆరోగ్యకరమైన ఆహారంలో వస్తుంది. అయితే పెరుగు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?.. తింటే ఏమవుతుంది..? అనే దానిపై నిపుణులు పలు అభిప్రాయాలను వెల్లడించారు. మీరు ఆరోగ్యంగా ఉండి ఇంకా రోజూ పెరుగు తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటున్నారు. అయితే, పెరుగు తినే సమయాన్ని బట్టి, అది హాని లేదా ప్రయోజనం కలిగించవచ్చు. పెరుగును రాత్రిపూట తీసుకుంటే, అది ఛాతీలో బిగుతుగా మారవచ్చు. కాబట్టి రోజూ పెరుగు తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..