Aloe Vera Benefits: పరగడుపున కలబంద జ్యూస్‌ తాగితే బోలెడు ప్రయోజనాలు..! ఈ 9 సమస్యలకు చక్కటి పరిష్కారం..

|

Dec 07, 2022 | 1:34 PM

కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో..కుండీల్లో కూడా పెరుగుతుంది. చర్మం, జుట్టు, జీర్ణ సమస్యలకు చికిత్స చేసే సామర్థ్యానికి కలిగి ఉంటుంది.

Aloe Vera Benefits: పరగడుపున కలబంద జ్యూస్‌ తాగితే బోలెడు ప్రయోజనాలు..! ఈ 9 సమస్యలకు చక్కటి పరిష్కారం..
Aloe Vera Benefits
Follow us on

అలోవెరా, ఒక సాధారణంగా ఇంట్లో పెరిగే మొక్క. వీటిని పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతాయి. ఈ కలబంద చూడటానికి కొంచెం దట్టాంగా ముళ్ళు స్వభావం కలిగి ఉండి, జిగురులాంటి గుజ్జు పదార్థాంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో..కుండీల్లో కూడా పెరుగుతుంది. చర్మం, జుట్టు, జీర్ణ సమస్యలకు చికిత్స చేసే సామర్థ్యానికి కలిగి ఉంటుంది. కలబందలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వల్ల గాయాలతో కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. దీని నిర్వాహణ కూడా సులభమే..ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబటి గాలిలో ఉన్న తేమను పీల్చుకొనే జీవించే గుణం కలిగి ఉంటుంది.

  1. దీనిని కాస్మోటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాల్లోను విరివిగా వాడుతున్నారు.
  2. జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటని తగ్గించుకునేందుకు, అజీర్తివల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  3. ఈ మధ్యకాలంలో చాలామంది తలనొప్పితో బాధపడుతున్నారు. వీరికి కలబంద రసం దివ్య ఔషధం. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే చాలా రకాల తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  4. దీంతో మలబద్దకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. మీరు పరగడుపున కలబంద జ్యూస్‌ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
  5. కలబంద రసం శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఆరోగ్య సమస్యలు కలిగించే అనేక విషపూరిత పదార్థాలు శరీరంలో ఉంటాయి. కలబంద రసం తీసుకోవడం వల్ల ఇవి తొలగిపోతాయి. దీనివల్ల ఆస్పత్రికి వెళ్లే అవసరం ఉండదు.
  6. షుగ‌ర్‌తో బాధపడేవారికి క‌ల‌బంద రసం దివ్యౌష‌ధంలా ప‌ని చేస్తుంది. దీనివ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న వారు క‌ల‌బంద‌ను నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ల‌భిస్తుంది.
  7. క‌ల‌బంద రసం తాగితే కీళ్లు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పలు త‌గ్గుతాయి. శ‌రీరానికి కావాల్సిన విట‌మిన్లు పుష్కలంగా ల‌భిస్తాయి.
  8. కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.
  9. అలోవెరా ఉపయోగించడం వల్ల చర్మం, జుట్టు కూడా ఎంతో అందంగా మారుతుంది. అలోవెరా జ్యూస్‌ని కూడా చాలా మంది తాగుతూ ఉంటారు. దీని వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం