
కానీ అది పరిమితి దాటితేనే ప్రమాదం పొంచి ఉంటుంది. కొలెస్ట్రాల్‌లోని రకాలు, అది పెరగడానికి కారణాలు, నియంత్రించే మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం. శరీరంలో ఎటువంటి నొప్పి ఉండదు, బయటకు ఏ లక్షణాలు కనిపించవు. కానీ లోపల మాత్రం ధమనులలో కొవ్వు నిశ్శబ్దంగా పేరుకుపోతూ రక్తం ప్రవహించకుండా అడ్డుకుంటుంది. అందుకే దీనిని వైద్య నిపుణులు ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాల్లో సుమారు 30 శాతం గుండె సంబంధిత సమస్యల వల్లే జరుగుతున్నాయి. మన శరీరానికి కణాల నిర్మాణానికి, విటమిన్ డి తయారీకి అవసరమైన కొలెస్ట్రాల్.. ఒక్కసారిగా శత్రువులా ఎలా మారుతుందో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం కొలెస్ట్రాల్ అనేది కాలేయం ఉత్పత్తి చేసే ఒక మైనం వంటి పదార్థం. ఇది రక్తంలో రెండు రూపాల్లో ప్రయాణిస్తుంది.
కొలెస్ట్రాల్ పెరగడానికి జన్యుపరమైన కారణాలు ఒకటైనప్పటికీ, జీవనశైలి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, ధూమపానం, మద్యపానం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపు కూడా గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.
కొలెస్ట్రాల్‌ను ఆహారం ద్వారా నియంత్రించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మాంసం, వెన్న, చీజ్ వంటి సంతృప్త కొవ్వులు తగ్గించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, పప్పు ధాన్యాలు, బెండకాయ, వంకాయ, ఆపిల్, ద్రాక్ష, జామ వంటి పండ్లు తీసుకోవాలి. వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు), చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిలోని ‘అల్లిసిన్’ అనే సమ్మేళనం కొలెస్ట్రాల్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రిఫైన్డ్ ఆయిల్స్, చక్కెరను పూర్తిగా పక్కన పెట్టడం ఉత్తమం.
వారానికి కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. సూర్యనమస్కారాలు, కపాల్‌భాతి వంటి యోగా ప్రక్రియలు మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడిన ఆహారం, వ్యాయామం ద్వారా 3 నుండి 6 నెలల్లోనే కొలెస్ట్రాల్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. నిశ్శబ్దంగా ప్రాణాలు తీసే ఈ సమస్యపై అవగాహన పెంచుకుని ఆరోగ్యంగా ఉండటమే మనం చేయాల్సిన పని. మరి మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పుడు చెక్ చేయించుకున్నారు?