
బరువు తగ్గాలని అనుకునే వారికి సరైన ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం బరువు త్వరగా తగ్గుతుంది. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే కొన్ని సహజ ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.
చిన్నగా కనిపించినా చియా గింజలు చాలా శక్తివంతమైనవి. వీటిలో ఒమేగా 3 కొవ్వులు, ఎక్కువ ఫైబర్, తగినంత ప్రోటీన్ ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి. ఎక్కువసేపు పొట్ట నిండినట్లు అనిపించేలా చేస్తాయి. ఇది మధ్యాహ్నం వచ్చే చిన్న ఆకలిని తగ్గిస్తుంది.
చిక్కుడుకాయ గింజలు లేదా చిక్కుళ్లు మంచి ఫైబర్ అందిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఆకలిని అదుపు చేయవచ్చు. ప్రోటీన్ పుష్కలంగా ఉండడం వల్ల వీటిని రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు.
ఓట్స్ అనేది ఆరోగ్యకరమైన ఉదయపు అల్పాహారంగా ప్రసిద్ధి. ఇందులోని బీటా గ్లూకాన్ అనే రకం ఫైబర్ జీర్ణక్రియను నెమ్మది చేసి ఆకలిని తగ్గిస్తుంది. ఇది మీ ఆహారాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గే ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
చిలగడదుంపలలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువ కాలం ఆకలి వేయకుండా చూస్తాయి. ఎక్కువగా తినకుండా ఆపి శరీరం బరువు అదుపులో ఉండేందుకు సహాయపడతాయి.
బాదం పప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొద్దిగా తిన్నా కూడా ఎక్కువసేపు ఆకలిని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన స్నాక్ గా వీటిని రోజుకు రెండుసార్లు తినవచ్చు.
యాపిల్స్ లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను అదుపు చేసి ఆకలిని తగ్గిస్తుంది. రోజుకు ఒక్క యాపిల్ తినడం బరువును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. మంచి ఫైబర్ మూలం కూడా. తియ్యగా ఉండే బ్లూబెర్రీలు ఆకలిని అదుపు చేయడానికి తోడ్పడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.
అవకాడోలో ఉన్న ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువసేపు పొట్ట నిండిన భావనను కలిగిస్తాయి. ఇది మళ్ళీ తినాలనే కోరికను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఇది చాలా బాగా పని చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)