
గుమ్మడి విత్తనాల్లో మంచి ప్రోటీన్, ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులు, పీచు పదార్థాలు ఉన్నాయి. ఇవి తిన్న తర్వాత కడుపు నిండినట్టు అనిపిస్తుంది. దీని వల్ల ఎప్పటికప్పుడు తినాలనే ఆలోచన ఉండదు. బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. ఇంకా శరీరంలో రోగాల నుంచి రక్షణ కలిగించే శక్తి పెరుగుతుంది.
చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. ఎక్కువగా తినకుండా బరువును నియంత్రించుకోవచ్చు.
పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ, సెలీనియం, ఫైబర్, ప్రోటీన్ లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడతాయి.
జనపనార విత్తనాల్లో (hemp seeds) మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించి తక్కువగా తినేలా చేస్తాయి. దీని వలన బరువు తగ్గడం సులభమవుతుంది.
అవిసె గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి శరీర రోగ నిరోధకతను పెంచుతాయి. కేలరీలు తక్కువ కాలంలో ఎక్కువగా ఖర్చవుతాయి. ఇలా బరువు తగ్గడంలో సహాయం జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
నువ్వుల్లో పీచు పదార్థాలు బాగా ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. బరువు తగ్గించడంలో తోడ్పడతాయి. శరీరం దెబ్బతినకుండా రక్షణ కలిగించేందుకు సహాయపడతాయి.
మెంతులు ఆకలిని నియంత్రించడంలో చక్కగా పనిచేస్తాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతాయి. డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ ప్రభావం వల్ల బరువు కూడా తగ్గుతుంది.
పుచ్చకాయ విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఇవి తిన్న వెంటనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. తక్కువ కాలరీలతో శరీరాన్ని తృప్తి పరుస్తాయి. దీని వలన బరువు నియంత్రణలో ఉంటుంది.
సబ్జా గింజల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. వేసవిలో ఈ గింజలతో నీటిని తాగితే శరీర వేడి తగ్గుతుంది. అదే సమయంలో బరువు కూడా తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)