Diabetic Diet: షుగర్ ఉన్నా టెన్షన్ పడకండి.. పొద్దున్నే ఇవి తినండి..! మీరు తినాల్సినవే..!

షుగర్ ఉన్నవారు రోజంతా తమ ఆహారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా ఉదయం చేసే అల్పాహారం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సహజంగానే పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సరైన ఆహారాన్ని తీసుకుంటే షుగర్‌ ను బాగా నియంత్రించవచ్చు. ఉదయాన్నే తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి తెలుసుకుందాం.

Diabetic Diet: షుగర్ ఉన్నా టెన్షన్ పడకండి.. పొద్దున్నే ఇవి తినండి..! మీరు తినాల్సినవే..!
Diabetes

Updated on: Jun 06, 2025 | 7:44 PM

రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయాన్నే నిమ్మకాయ రసాన్ని కొద్దిగా వేడి నీటిలో కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడటమే కాకుండా జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచుతుంది. అయితే అమ్లత సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ లాంటి పండ్లు ఫైబర్ యాంటీఆక్సిడెంట్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంలో ఉంచడంలో సహాయపడతాయి. అలాగే శరీర బరువును నియంత్రించడంలో కూడా ఇవి తోడ్పడతాయి. ఉదయాన్నే
ఈ పండ్లను తీసుకోవడం మంచి అలవాటు.

ఉదయాన్నే ఆకలిని తగ్గిస్తూ శక్తిని అందించే మంచి ఎంపిక ఆకుకూరలతో చేసిన హెల్తీ స్మూతీ. పాలకూర, ముల్లంగి ఆకులు, కొత్తిమీర, దోసకాయ, పుదీనాతో చేసిన ఈ షేక్ అరుగుదలకు మేలు చేస్తుంది. ఇవి గ్లూకోజ్ స్థాయిని నెమ్మదిగా తగ్గించే గుణం కలిగి ఉంటాయి. ఇంట్లోనే తాజా పదార్థాలతో తయారు చేసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించాలంటే ప్రొబయాటిక్ ఎక్కువగా ఉన్న తీయని లేని సాదా పెరుగు తినడం మంచిది. ఇది శరీరానికి మంచి బ్యాక్టీరియా అందించి అరుగుదల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ అలవాటు గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

గుడ్లు మంచి కొవ్వులకు ప్రోటీన్‌ కు మంచి ఆధారం. ఇవి ఉదయాన్నే తినడం వల్ల తక్కువ కేలరీలతో ఎక్కువ స్థాయిలో కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో మధ్యాహ్నం వరకు ఆకలి కాకుండా ఉంటుంది. షుగర్ నియంత్రణకు ఇది ఉపయోగపడటంతోపాటు అనవసరమైన చిరుతిళ్ళపై నియంత్రణ సాధించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)