Health News: మీ వంటింట్లో ఉండే పదార్థాలతో జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యలను తగ్గించుకోండిలా… అవేంటంటే..

సాధరణంగా చలికాలంలో గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలతో అందరూ బాధపడుతుంటారు. ఇక ప్రస్తుతం కరోనా సమయంలో ఈ వ్యాధుల

Health News: మీ వంటింట్లో ఉండే పదార్థాలతో జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యలను తగ్గించుకోండిలా... అవేంటంటే..

Edited By:

Updated on: Jan 16, 2021 | 3:15 PM

సాధరణంగా చలికాలంలో గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలతో అందరూ బాధపడుతుంటారు. ఇక ప్రస్తుతం కరోనా సమయంలో ఈ వ్యాధుల ప్రభావం మరీ ఎక్కువైంది. జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా వెంటనే కరోనా వచ్చిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధరణంగా చలికాలంలో ఈ సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే మన వంటింట్లో ఉండే మాసాలా దినుసులు, అల్లం, వెల్లులల్లి పదార్థాలతో వీటిని రాకుండా చేయవచ్చు. అదేలానో చూసేద్దామా..

అల్లం, బెల్లం, మాసాలా దినుసులను కలిసి కషాయంగా చేసుకొని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో లవంగాలు, నల్ల మిరియాలు, యాలకులు, అల్లం, బెల్లం వేసి కాసేపు వేడి చేసి తీసుకోవడం వలన గొంతు నొప్పి, దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, టూస్పూన్ అల్లం, నల్ల ఉప్పు, పసుపు, నల్ల మిరియాలు, 5-6 తులసి ఆకులను వేసి కషాయంగా చేసుకోవాలి. దీనిని తాగడం వలన చాతి నొప్పి, జలుబు సమస్యలను నుంచి త్వరగా కోలుకుంటారు. వీటితోపాటు వేడినీళ్ళలో టీస్పూన్ మిరియాలు, నిమ్మరసం కలిపి మరిగించాలి. దీనిని ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Also Read:

Winter Health: చలికాలంలో ఒళ్లు నొప్పులు బాధిస్తున్నాయా..? అయితే ఈ చిట్కాలను పాటించండి..