Mental Health: మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా? అయితే వీటిని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే సమస్య ఫసక్

| Edited By: Janardhan Veluru

Feb 24, 2023 | 7:29 AM

సెరోటోనిన్ మన మానసిక స్థితిని నియంత్రించడమే కాకుండా, మన జీర్ణవ్యవస్థను కూడా సరిగ్గా ఉంచుతుంది. దీన్ని 'ఫీల్ గుడ్ హార్మోన్' అని కూడా అంటారు. శరీరంలో సరైన మోతాదులో సెరోటోనిన్ ఉంటే మంచి నిద్ర వస్తుంది.

Mental Health: మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా? అయితే వీటిని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే సమస్య ఫసక్
Mood Swings
Follow us on

ఉరకలు పరుగుల జీవితంలో చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అయితే డైట్ పరంగా కొన్ని మార్పులతో సహజమైన పద్ధతులతో మీ మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. సెరోటోనిన్ హార్మోన్ మన మానసిక స్థితిని నియంత్రించడమే కాకుండా, మన జీర్ణవ్యవస్థను కూడా సరిగ్గా ఉంచుతుంది. దీన్ని ‘ఫీల్ గుడ్ హార్మోన్’ అని కూడా అంటారు. శరీరంలో సరైన మోతాదులో సెరోటోనిన్ ఉంటే మంచి నిద్ర వస్తుంది. ఇందులోని కెమికల్ మెసెంజర్ సాధారణంగా మంచి అనుభూతిని ఇవ్వడంతో పాటు ఎక్కువ  కాలం జీవించడానికి  ఉపయోగపడుతుంది. కొన్ని ఫుడ్ సప్లిమెంట్లు మీ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. మీ సెరోటోనిన్ స్థాయిని పెరగాలంటే, మీరు ట్రిప్టోఫాన్ కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినడానికి ప్రయత్నించాలి.  ఎందుకంటే డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి మూడ్ సంబంధిత సమస్యలతో బాధపడేవారిలో ట్రిప్టోఫాన్ లోపం కనిపిస్తుంది.

హెల్త్‌ లైన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, మీరు తక్కువ ట్రిప్టోఫాన్ ఆహారం తీసుకున్నప్పుడు, మెదడులోని సెరోటోనిన్ స్థాయి కూడా పడిపోతుందని పరిశోధనలో తేలింది. సెరోటోనిన్ స్థాయిని పెంచడంలో సహాయపడే ట్రిఫ్టోఫాన్ 4 ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గుడ్డు:

2015 లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, గుడ్డులో ఉండే ప్రోటీన్ మీ రక్త ప్లాస్మాలో ట్రిప్టోఫాన్ స్థాయిని గణనీయంగా పెంచుతుంది, గుడ్డు పచ్చసొన చాలా ముఖ్యమైనది. ఇందులో గణనీయమైన మొత్తంలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. దీనితో పాటు టైరోసిన్, కోలిన్, బయోటిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది కాకుండా, గుడ్లలో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఇతర పోషకాలు , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి.

చీజ్:

ఇది చాలా రుచికరమైన ఆహార పదార్ధం, దీని గురించి ఆలోచిస్తే నోటిలో నీరు వస్తుంది. బర్గర్, పిజ్జా, పరాటా ఇలా ఏది తయారు చేసినా అందులో చీజ్ వాడుతాం. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం చీజ్‌లో ఉంటుంది, ఇది ఒత్తిడిని తగ్గించడానికి , మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

పైనాపిల్:

పైనాపిల్ తినడం వల్ల సెరోటోనిన్ స్థాయి పెరుగుతుందని చాలా అధ్యయనాలలో తేలింది. అయితే మీరు దానిని తాజాగా తినాలి. పండు ఎంత పండితే అంత తక్కువ సెరోటోనిన్ ఉత్పత్తి అవుతుంది.

సాల్మన్ :

సాల్మన్ చేపలో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో మెలటోనిన్ , సెరటోనిన్ వంటి హార్మోన్లను తయారు చేయడానికి పనిచేస్తుంది.

డ్రై ఫ్రూట్స్ :

డ్రై ఫ్రూట్స్ ట్రిప్టోఫాన్ కలిగి ఉంటాయి. రోజుకు కొన్ని డ్రైఫ్రూట్స్ తినడం వల్ల క్యాన్సర్, గుండె సమస్యలు , శ్వాసకోశ సమస్యల నుండి మరణాలు కూడా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..