Health Checkup: ఏడాదికి ఒక్కసారి ఈ 4 ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.. ఎందుకంటే..?

|

Apr 12, 2022 | 8:06 AM

Health Checkup: మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడుతామో తెలియకుండా ఉంది. అందుకే తప్పనిసరిగా ఏడాదికొకసారి

Health Checkup: ఏడాదికి ఒక్కసారి ఈ 4 ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.. ఎందుకంటే..?
Health Checkup
Follow us on

Health Checkup: మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడుతామో తెలియకుండా ఉంది. అందుకే తప్పనిసరిగా ఏడాదికొకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే కొన్ని వ్యాధులు మనకి తెలియకుండానే వస్తాయి. అందుకే హెల్త్‌ చెకప్ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన మహిళలు, పురుషులు కచ్చితంగా ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఉద్యోగులు కూడా ఈ విషయంలో అలర్ట్‌గా ఉండాలి. మీరు సంవత్సరానికి ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోవాలి. నేటి జీవనశైలి వల్ల షుగర్‌ పెరగడం సర్వసాధారణమైపోయింది. చక్కెర పెరగడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

హిమోగ్లోబిన్ టెస్ట్‌

హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. హిమోగ్లోబిన్ పరీక్షను పూర్తి రక్త పరీక్ష అంటారు. ఇది ఒక రకమైన సాధారణ రక్త పరీక్ష. ఆహారంలో ఐరన్ లోపం ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటుంది. అందుకే సంవత్సరానికొకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి.

కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి

కొలెస్ట్రాల్‌ను తనిఖీ చేయడానికి లిపిడ్ పరీక్ష ఉంటుంది. వాస్తవానికి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. అది మంచి కొలస్ట్రాల్‌, చెడు కొలస్ట్రాల్‌. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిలో మీరు ఖచ్చితంగా కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి.

థైరాయిడ్ టెస్ట్‌

ఇది కాకుండా సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ టెస్ట్‌ చేయించుకోవడం అవసరం. ప్రస్తుత కాలంలో ఇది నిశ్శబ్ద కిల్లర్‌లా విస్తరిస్తోంది. అందకే జాగ్రత్తగా ఉండటం అవసరం.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Summer Tips: వేసవిలో చియా సీడ్స్‌, మజ్జిగ వల్ల అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి ఉపశమనం..!

Alum Water: పటిక నీటితో ముఖం కడుక్కుంటే అద్భుత ప్రయోజనాలు..!

Health Tips: అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!