
అమ్మాయిలు గర్భం దాల్చగానే అందరూ ఇచ్చే సలహా ఒకటే.. ‘ఏం చేయొద్దు, పడుకో, రెస్ట్ తీసుకో!’. కానీ అది ఎంత మాత్రం సరైనది కాదంటోంది సైన్స్. గర్భిణీలు కొద్దిగా వ్యాయామం చేస్తే తల్లి మాత్రమే కాదు, పుట్టబోయే బేబీ కూడా స్ట్రాంగ్, స్మార్ట్, హ్యాపీగా పుడతారంట! ఇది ఏదో కొత్త ట్రెండ్ కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా గర్భిణీలకు వారానికి 150 నిమిషాల మోడరేట్ ఎక్సర్‌సైజ్ సిఫార్సు చేస్తోంది. గర్భవతులు ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
* వ్యాయామం చేసే గర్భిణీలకు వెన్నునొప్పి, కాళ్ల వాపు, కటి నొప్పి తగ్గుతాయి. ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ (కీగల్స్) చేస్తే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ పెరుగుతాయని ఓ అధ్యయనం చెబుతోంది. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేసిన అమ్మాయిలకు సిజేరియన్ రేటు 20-30% తక్కువ అంటున్నారు నిపుణులు!
* గర్భం దాల్చినప్పుడు మహిళల్లో హార్మోన్స్ సమతుల్యత ఉండదు. వ్యాయామం వల్ల ఎండార్ఫిన్స్ (హ్యాపీ హార్మోన్స్) రిలీజ్ అవుతాయి. ఫలితంగా డిప్రెషన్, యాంక్సైటీ తగ్గి రోజంతా సంతోషంగా ఉంటారు. తద్వారా బేబీకి కూడా ఈ హ్యాపీ వైబ్స్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి, అందువల్ల పుట్టిన తర్వాత శిశువులు కూడా ఎక్కువగా నవ్వుతారట!
* వాకింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి గర్భిణీల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతాయి. ఒక అధ్యయనం ప్రకారం వ్యాయామం చేసిన గర్భిణీల్లో జెస్టేషనల్ డయాబెటిస్ రిస్క్ 50% వరకు తగ్గింది. అంటే వ్యాయామం వల్ల తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉండొచ్చన్నమాట.
* గర్భిణీలు వ్యాయామం చేస్తే బేబీకి ఎక్కువ ఆక్సిజన్, న్యూట్రియెంట్స్ అందుతాయి. ఫలితంగా పుట్టినప్పుడు బేబీ ఆరోగ్యకరమైన బరువుతో ఉంటుంది. మెదడు పెరుగుదల మెరుగవుతుంది. అంతేకాదు, గర్భిణీలు వ్యాయామం చేస్తే పుట్టే బిడ్డ IQ పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
* డాక్టర్ల సలహా తీసుకుని గర్భిణీలు రోజూ 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్, ప్రెగ్నెన్సీ యోగా, స్విమ్మింగ్, కీగల్స్ ఎక్సర్‌సైజ్, లైట్ స్ట్రెచింగ్, డీప్ బ్రీతింగ్ వంటివి చేయడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.
* బ్లీడింగ్, బ్లీడింగ్, తీవ్రమైన నొప్పి, మైకం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలుంటే వ్యాయామం చేయకపోవడమే మంచిది.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.