Coronavirus: కరోనా వైరస్ మూడవ వేవ్ ముప్పు నేపధ్యంలో ఒక షాకింగ్ పరిశోధన తెరపైకి వచ్చింది. 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డకు కరోనా సోకినట్లయితే, ఇంటి పెద్దలకు ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ పరిశోధనలో వెల్లడైంది. కెనడా ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్, అంటారియో పరిశోధకులు ఈ పరిశోధనలు చేశారు. జామా నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల నుండి కుటుంబ సభ్యులకు వ్యాధి బారిన పడే ప్రమాదం 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల టీనేజర్ల కంటే 1.4 రెట్లు ఎక్కువ. అదనంగా, 20- 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు చిన్న పిల్లల నుండి సంక్రమణకు గురవుతారు. అయితే, 40 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు పెద్ద పిల్లల నుండి సంక్రమణకు గురవుతారు.
పరిశోధకులు చిన్నపిల్లల నుండి సంక్రమణ ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వారు ఇంటిలోని ఇతర సభ్యులతో ఎక్కువ శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారు. అలాగే, చిన్న పిల్లలను వేరుచేయడం కష్టం, కాబట్టి వారిని సంరక్షించే వ్యక్తులలో సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది.
పిల్లలకు కరోనా సోకిన 6,280 ఇళ్లలో పరిశోధన..
పిల్లల నుండి పెద్దల వరకు సంక్రమణ వ్యాప్తి చెందే ప్రమాదం ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవడానికి పరిశోధన జరిగింది. 1 జూన్ 2020 మరియు 21 డిసెంబర్ 2020 మధ్య పిల్లలు సోకిన 6,280 ఇళ్లను పరిశోధకుల బృందం సందర్శించింది.
4 రకాల వయస్సు గల పిల్లలను పరిశోధనలో చేర్చారు. మొదటిది – 0 నుండి 3 సంవత్సరాలు, రెండవది – 4 నుండి 8 సంవత్సరాలు, మూడవది – 9 నుండి 13 సంవత్సరాలు, నాలుగవది 14 నుండి 17 సంవత్సరాలు.
ఫలితాలు: 0 నుండి 3 సంవత్సరాల వయస్సు గల 766 మంది సోకిన పిల్లల నుండి ఇంటిలోని 234 ఇతర సభ్యులకు వ్యాపించాయని ఫలితాలు వెల్లడించాయి. అదే సమయంలో, 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల 17,636 మంది పిల్లల నుండి 2376 కుటుంబ సభ్యుల మధ్య కోవిడ్ వ్యాపించింది.
1 లక్ష మంది చిన్నపిల్లల నుండి, 30,548 కుటుంబ సభ్యులు వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మరోవైపు, టీనేజర్ల నుండి సంక్రమణ ప్రమాదం దీని కంటే తక్కువగా ఉంటుంది. 1 లక్ష మంది సోకిన టీనేజర్‌లు 26,768 కుటుంబ సభ్యులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
చిన్న పిల్లలలో సంక్రమణకు రెండు కారణాలు
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, పెద్ద పిల్లల కంటే చిన్న పిల్లల నుండి కుటుంబ సభ్యులకు సంక్రమణ ప్రమాదం పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి.
మొదటి కారణం- చిన్న పిల్లల ముక్కు , గొంతులో వైరస్ లోడ్ పెద్ద పిల్లల కంటే ఎక్కువగా ఉంటుంది.
రెండవ కారణం- సంక్రమణ తర్వాత పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. పిల్లలు లక్షణరహితంగా ఉన్నందున, ఈ ఇన్ఫెక్షన్ పెద్దలకు సులభంగా వ్యాప్తి చెందుతుంది.
జాగ్రత్తలు ఇలా..
ఇంటిలోని పెద్దలు మాస్క్‌లు ధరించాలి. అయితే పిల్లల ద్వారా పెద్దలకు ఇన్‌ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపించకపోయినప్పటికీ, ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ పిల్లలకు ఇంట్లో ఇన్‌ఫెక్షన్ సోకినట్లయితే, వారి సంరక్షణ సమయంలో తల్లిదండ్రులు.. ఇతర పెద్ద సభ్యులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.