Chest Pain: ఛాతిలో మంటా.? అస్సలు లైట్ తీసుకోకండి.. గుండెపోటుతో పాటు..

|

Dec 30, 2023 | 4:57 PM

ఛాతిలో మంట కొన్ని సందర్భాల్లో చిన్న సమస్యే అయినా. మరికొన్ని సందర్భాల్లో మాత్రం చాలా డేంజర్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఛాతిలో సమస్య అనగానే మొదట గుండెపోటు వస్తుందేమో అని భయపడతారు. సాధారణంగా నిపుణులు కూడా ఛాతిలో మంటకు గుండెపోటుకు మధ్య సంబంధం ఉందని చెబుతుంటారు. అయితే...

Chest Pain: ఛాతిలో మంటా.? అస్సలు లైట్ తీసుకోకండి.. గుండెపోటుతో పాటు..
Chest Pain
Follow us on

ఛాతిలో మంట.. సర్వసాధారణమైన విషయం. చాలా మంది ఎప్పుడో ఒకసారి ఈ సమస్యతో బాధపడే ఉంటారు. అయితే ఛాతిలో మంట కొన్ని సందర్భాల్లో చిన్న సమస్యే అయినా. మరికొన్ని సందర్భాల్లో మాత్రం చాలా డేంజర్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఛాతిలో సమస్య అనగానే మొదట గుండెపోటు వస్తుందేమో అని భయపడతారు. సాధారణంగా నిపుణులు కూడా ఛాతిలో మంటకు గుండెపోటుకు మధ్య సంబంధం ఉందని చెబుతుంటారు. అయితే ఛాతిలో మంట కేవలం గుండెపోటుకు మాత్రమే కాకుండా మరికొన్ని సమస్యలకు కూడా లక్షణమని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

* ఛాతీలో మంట కొన్ని సందర్భాల్లో ప్రేగు క్యాన్సర్‌కు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. న్న వాహికలో అడెనో కార్సినోమా అనే క్యాన్సర్‌ కారణంగా ఛాతిలో మంట వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్యాన్సర్ బారిన పడితే అన్నవాహిక లైనింగ్‌ను ప్రభావితం అవుతుంది. ఈ కారణంగానే ఛాతిలో మంట వస్తుంది.

* హెర్నియా అనే సమస్య కారణంగా కూడా ఛాతిలో మంటగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో కొంత భాగం దిగువ ఛాతీలోకి దూరడాన్ని హెర్నియాగా అభివర్ణిస్తుంటారు. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య వస్తుంది. త్వరగా చికిత్స అందిస్తే ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. అలా కాకుండా వదిలెస్తే మాత్రం నిరంతర ఛాతీలో మంట అన్నవాహికకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది. అఆలగే వాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

* పెప్టిక్‌ అల్సర్‌ వ్యాధి కారణంగా కూడా ఛాతిలో మంట భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలోని చిన్న ప్రేగు లోపలి ఉపరితలంపై అల్సర్లు ఏర్పడినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఛాతిలో దీర్ఘకాలంగా మంట సమస్య వేధిస్తుంటే వెంటనే అలర్ట్‌ అవ్వాలి.

* కొన్ని సందర్భాల్లో కడుపులోని యాసిడ్స్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పడు కూడా ఛాతిలో మంట ఏర్పడుతుంది. యాసిడిటీతో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీర్ఘకాలంగా ఛాతిలో మంట సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.