
ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య శరీరం ఎక్కువగా జీర్ణ ఎంజైమ్ లు ఉత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో తీసుకునే పోషకాలు శరీరానికి మూడు రెట్లు మెరుగుగా గ్రహించబడతాయని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. అందుకే ఈ సమయంలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగడం వల్ల దాని ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయి.
కొబ్బరి నీటిలో ఉండే లారిక్ యాసిడ్ వంటి మధ్యస్థ శ్రేణి కొవ్వులు శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటంతో ఖాళీ కడుపుతో తీసుకుంటే శుభ్రతకు సహకరిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు రాత్రిపూట టాక్సిన్లను ఫిల్టర్ చేస్తూ పనిచేస్తుంటాయి. ఉదయాన్నే ఈ ప్రక్రియను సమర్థంగా కొనసాగించేందుకు అవసరమైన ఖనిజాలు.. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం కొబ్బరి నీటిలో సమృద్ధిగా లభిస్తాయి. ఈ డ్రింక్ లో పొటాషియం-సోడియం నిష్పత్తి 25:1 ఉండటం వల్ల మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది.
కెఫిన్ వంటి ఉత్తేజపరిచే పదార్థాల బదులుగా.. కొబ్బరి నీటిలో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటివి నెమ్మదిగా శరీరంలోకి కలుస్తాయి. దీని వల్ల శక్తి స్థాయిలు స్థిరంగా కొనసాగుతాయి. ఇది ఎటువంటి వణుకు లేకుండా ప్రశాంతమైన శక్తిని అందిస్తుంది.
కొబ్బరి నీటిలో ఉండే సైటోకినిన్స్ అనే సహజ మొక్కల హార్మోన్లు కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తూ.. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇది చర్మం రంగును మెరుగుపరచడంలో, మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.
ఇందులో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్లు శరీరంలో కొవ్వుగా నిల్వకాకుండా వెంటనే శక్తిగా మారిపోతాయి. ఇది శరీరం సహజంగా కాలరీలు ఖర్చు చేసే విధానాన్ని వేగవంతం చేస్తుంది. ప్రతి ఉదయం కొబ్బరి నీటిని తాగడం మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతుంది.
ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే.. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు తాజా కొబ్బరి నీరు తాగడం మంచి ఆచరణ. అయితే 15 నుంచి 20 నిమిషాల తర్వాత మాత్రమే ఇతర ఆహారం లేదా డ్రింక్స్ లను తీసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)