boiled peanuts
వేరుశనగను సామాన్యుడి జీడిపప్పు అంటారు. వేరుశనగలో ఫాస్పరస్, ప్రొటీన్లు, లిపిడ్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వేరుశెనగలో రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండటం వల్ల హృదయనాళ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ గింజలను నీటిలో నానబెట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నానబెట్టిన వేరుశెనగలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు ఇవే…
- శనగలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నియంత్రించగలదు.నానబెట్టిన వేరుశెనగలోని యాంటీఆక్సిడెంట్స్‌ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి, ప్రాణాంతక కణాలను బాడీలో పెరగకుండా నివారిస్తాయి.
- నానబెట్టిన వేరుశెనగలను ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు
- నానబెట్టిన వేరుశెనగలను రోజూ ఉదయం తింటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- క్యాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న వేరుశెనగలను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఎముకలు బలపడతాయి. ఎముక సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
- నట్స్‌లో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా, అనేక అంటువ్యాధులు, వ్యాధులను నివారించవచ్చు.
- నానబెట్టిన వేరుశనగలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఫైబర్‌పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి రిలీఫ్ ఇస్తుంది.
- వేరుశెనగలో ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు కంటి చూపును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా సంబంధిత డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమ మార్గం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..