
చల్లని నీటితో స్నానం చేయాలి: మీకు శరీరంలో మొటిమల సమస్య ఉంటే.. స్నానం చేయడానికి చల్లటి నీటిని మాత్రమే ఉపయోగించాలి. అయితే శీతాకాలంలో మీరు స్నానానికి కొద్దిగా వెచ్చని నీటిని ఉపయోగించాలి.

స్క్రబ్బింగ్: ముఖం వంటి శరీర మొటిమలను తొలగించడానికి మస్సాజ్ చేసుకోవాలి. వారానికి ఒకసారి బాడీ స్క్రబ్ చేస్తే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కంఫర్ట్ గా ఉండే దుస్తులను ధరించాలి: చలి వాతావరణంలో మీరు శరీరంలో మొటిమల వల్ల ఇబ్బంది పడుతుంటే కొన్ని పద్దతులను పాటించాలి. రాత్రి నిద్రిస్తున్నప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. వదులుగా ఉండే బట్టలు ధరిస్తే కంఫర్ట్ గా ఉంటుంది.

తేనె-దాల్చిన చెక్క: తేనె శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దాల్చిన చెక్క మొటిమలను తొలగించడానికి పని చేస్తుంది. తేనె, దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై పూసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

వేప ఆకులు: శరీరంలో ఏర్పడే మొటిమలను తొలగించడంలో వేప పేస్ట్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆకులను గ్రైండ్ చేసి దానిని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అనంతరం దానికి శరీరంపై మొటిమల మీద పూయాలి. ఇలా చేస్తే మొటిమల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.