Urine Infection: తరచుగా మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా.. ఈ చిట్కా పాటించి ఉపశమనం పొందండి

|

Aug 30, 2021 | 2:08 PM

Urine Infection: మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఇది గతకొంత కాలంగా తరచుగా వినిపిస్తున్న మాట. ఈ వ్యాధి సాధారణమైందే కాదు.. ప్రమాదకరం కూడా.. అయితే ఈ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ గతంలో..

Urine Infection: తరచుగా మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా.. ఈ చిట్కా పాటించి ఉపశమనం పొందండి
Urine Infection
Follow us on

Urine Infection: మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఇది గతకొంత కాలంగా తరచుగా వినిపిస్తున్న మాట. ఈ వ్యాధి సాధారణమైందే కాదు.. ప్రమాదకరం కూడా.. అయితే ఈ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ గతంలో ఎక్కువగా మహిళల్లో కనిపించేది.. ఇప్పుడు జీవితంలో వచ్చిన మార్పులతో పాటు తినే ఆహారంలో వచ్చిన మార్పులతో పురుషుల్లో కూడా కనిపిస్తుంది. అయితే దాదాపు 60 శాతం మంది మహిళలు మూత్రాశయం ఇన్ఫెక్షన్ తో ఎప్పుడోకప్పుడు ఇబ్బందిపడినవారే.. అయితే దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో పడతారు.

పురుషులతో పోలిస్తే.. మహిళల్లో మూత్రాశయ మార్గం నుంచి మూత్రం బయటికి వెళ్లే మార్గం చాలా చిన్నగా ఉంటుంది. దాంతో బ్యాక్టీరియా చేరితే సులువుగా వ్యాపిస్తుంది. ఈ సమస్య కొందరిలో ఏడాదికి ఒకటి రెండుసార్లు వచ్చి తగ్గిపోతే మరికొందరిలో తరచూ ఇబ్బందిపెట్టొచ్చు. తరచూ ఇన్‌ఫెక్షన్‌ కనిపించడం, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. అది క్రమంగా అధిక రక్తపోటుకు దారితీసి.. చివరకు మూత్రపిండాలు పనిచేయని పరిస్థితి ఎదురవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అయితే ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో మంట అనేది వస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ గర్భిణీ స్త్రీలకు కలుగుతుంది. ఇలా జరగడానికి గల కారణం రోజు తగినంత నీటిని తీసుకుపోవడం అని చెప్పవచ్చు.

అయితే మూత్రంలో మంటని నిర్లక్ష్యం చేయకుండా మొదట్లోనే శ్రద్ధ పెట్టి..నివారించుకుంటే మంచింది. ఇంట్లో దొరికే ధనియాల పొడి , పటిక బెల్లం, ఉప్పులతో మూత్రంలో మంటను తగ్గించుకోవచ్చు. ఈ ధనియాలు పటిక బెల్లం అనేది మన శరీరానికి బాగా చలువ చేసి ఒంట్లో వున్న వేడిని తగ్గిస్తాయి . ముందుగా స్టౌ మీద గిన్నె పెట్టుకుని నీరు పోసి .. ఆ నీటిలో మూడు ఒక స్పూన్ల ధనియాల పొడి , పటికబెల్లం, అర స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత తాగితే మూత్రంలో వచ్చే మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: Banana Leaf: గ్రామాల్లో ఫ్రీగా దొరికే అరటి ఆకులు.. ఇక నుంచి ఆన్‌లైన్‌లో.. ఒక్కొక్కటి ఎంత ధర తెలిస్తే షాక్..