
రక్తపోటు సాధారణంగా 120/80 mm Hg ఉండాలి. అయితే, ఇది 90/60 mm Hg కంటే తక్కువగా ఉన్నప్పుడు దాన్ని తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) అంటారు. కొంతమందికి సహజంగానే తక్కువ రక్తపోటు ఉండవచ్చు, కానీ ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
తక్కువ రక్తపోటు ఉన్నప్పుడు, గుండెకు చేరే రక్తం పరిమాణం తగ్గుతుంది. ఇది గుండెకు, ముఖ్యంగా కీలక సమయాల్లో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఉదాహరణకు, మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండెకు ఎక్కువ రక్తం అవసరం అవుతుంది. ఆ సమయంలో రక్త ప్రసరణ తగ్గితే, గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందక ఇస్కీమియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కణజాలాలకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడి, చివరికి గుండెపోటుకు దారితీస్తుంది.
రక్తపోటు అకస్మాత్తుగా బాగా తగ్గితే, అది శరీర భాగాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా గుండె, మెదడు, మూత్రపిండాలకు తగినంత రక్తం అందదు. దీనివల్ల ఈ అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, చాలా తక్కువ రక్తపోటు హైపోవోలెమిక్ షాక్‌కు దారితీయవచ్చు. ఈ స్థితిలో శరీర అవయవాలకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందవు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మెదడు స్ట్రోక్ నుండి గుండెపోటు వరకు ఎలాంటి సమస్యలనైనా ఇది కలిగించవచ్చు. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం వల్ల ప్రమాదాలు, తీవ్రమైన గాయాలు కూడా సంభవించవచ్చు.
కొన్ని కారణాల వల్ల కొందరికి తక్కువ రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి:
ఎక్కువ కాలం మంచానికే పరిమితమైన వారికి.
చాలా సేపు నిలబడి పనిచేసేవారికి.
అధిక ఒత్తిడికి గురయ్యేవారు.
పార్కిన్సన్ వ్యాధి ఉన్నవారికి.
గర్భిణులలో కూడా తక్కువ రక్తపోటు సాధారణం.
శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్).
బీపీని తగ్గించే కొన్ని మందులు వాడేవారు.
తక్కువ రక్తపోటు ఉన్నప్పుడు తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి కొన్ని సహజ పద్ధతులు పాటించవచ్చు. ఉప్పు రక్తపోటును పెంచడంలో సహాయపడుతుంది. తగినంత నీరు తాగడం వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది. టీ లేదా కాఫీ తాగడం వల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరుగుతుంది.
దీన్ని తీసుకోవడం కూడా రక్తపోటును పెంచడానికి తోడ్పడుతుంది. కొత్తిమీరను నీటిలో నానబెట్టి తాగడం ప్రయోజనకరం.
(ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి. ఈ సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని ఎవరూ నిర్ధారించరు.)