Antibiotics: డాక్టర్​ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి!

భారతదేశంలో యాంటీబయాటిక్స్ ప్రభావం తగ్గుతోందా? అంటే అవుననే చెబుతున్నాయి పరిశోధనలు. ఇది కేవలం ఆందోళనకరమైన ప్రశ్న కాదు, ఆరోగ్య వ్యవస్థకు పొంచి ఉన్న పెను ముప్పు. ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) హాస్పిటల్ ఇటీవల నిర్వహించిన స్టడీ ప్రకారం యాంటీబయాటిక్స్​ మన శరీరంపై ..

Antibiotics: డాక్టర్​ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి!
Antibiotics

Updated on: Nov 21, 2025 | 10:31 AM

భారతదేశంలో యాంటీబయాటిక్స్ ప్రభావం తగ్గుతోందా? అంటే అవుననే చెబుతున్నాయి పరిశోధనలు. ఇది కేవలం ఆందోళనకరమైన ప్రశ్న కాదు, ఆరోగ్య వ్యవస్థకు పొంచి ఉన్న పెను ముప్పు. ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) హాస్పిటల్ ఇటీవల నిర్వహించిన స్టడీ ప్రకారం యాంటీబయాటిక్స్​ మన శరీరంపై ప్రభావం చూపలేకపోతున్నాయి.

భారతదేశం, అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ పరిశోధన, ఎండోస్కోపీ చేయించుకున్న 83% మంది రోగుల్లో మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ (MDR) బ్యాక్టీరియా ఉన్నట్టు వెల్లడైంది. అంటే, సాధారణ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా, మొదటి మూడవ స్టేజ్​ విఫలమవుతున్నాయి. చివరి రెండు రకాల మందులు మాత్రమే మిగిలి ఉన్నాయి, అవి కూడా ఎప్పుడైనా విఫలమవచ్చని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

కారణమేంటి..

ఈ పరిశోధన ప్రకారం, భారతదేశంలో డ్రగ్ రెసిస్టెన్స్ స్థాయి అంతర్జాతీయ స్థాయిలోని దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ. యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) 2022 రిపోర్ట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్ల మరణాలకు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) కారణమవుతోంది. భారతదేశంలో మాత్రమే, ప్రతి రోజూ 58,000 మరణాలు జరుగుతున్నాయని అంచనా.

ఈ సమస్యకు ప్రధాన కారణాలు? వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం, సెల్ఫ్-మెడికేషన్, పూర్తి కోర్స్ పూర్తి చేయకపోవడం. మెడికల్ స్టోర్‌లలో సులభంగా లభించడం వల్ల బ్యాక్టీరియా మ్యూటేషన్ జరిగి రెసిస్టెంట్ స్ట్రెయిన్స్‌గా మారుతున్నాయి. ఎండోస్కోపీ చేయించుకున్న 80% మందిలో డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటే, ఇది సమాజం, పర్యావరణం, రోజువారీ జీవితంలోని భాగం. యాంటీబయాటిక్స్‌ వాడకంపై అవగాహన అవసరం, వైద్యుల ప్రెస్క్రిప్షన్ లేకుండా యాంటిబయాటిక్స్​ విక్రయానికి కఠిన చట్టాలు తీసుకురావాలి అంటున్నారు నిపుణులు.

ఈ పరిస్థితి కొనసాగితే, సాధారణ ఇన్ఫెక్షన్‌లు కూడా చికిత్సకు లొంగకుండా ప్రమాదకరంగా మారతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)లో ఈకొలీ బ్యాక్టీరియా 70% రకాలు MDRగా మారాయి. భారతదేశంలో వార్షికంగా 10 లక్షల మంది AMR వల్ల మరణిస్తున్నారు. పర్యావరణ కాలుష్యం, ఆసుపత్రి వ్యవస్థల్లో హైజీన్ లోపాలు కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.

ఏం చేయాలి..

వైద్యుల సలహా లేకుండా ఔషధాల వాడకం పూర్తిగా మానేయాలి. దగ్గు, జలుబు వంటి వైరల్​ ఇన్ఫెక్షన్లకు యాంటిబయాటిక్స్​ వాడకూడదు. చేతులు తరచూ కడగాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. టెటనస్​, ఫ్లూ వంటి వ్యాక్సిన్​లను తప్పకుండా తీసుకోవాలి. ‘సైలెంట్​ పాండమిక్​’గా విస్తరిస్తున్న యాంటిబయాటిక్స్​ వాడకంపై అవగాహన కల్పించడం అవసరం. మీరూ వైద్యుల సలహా లేకుండా ఇష్టమొచ్చినట్లు మందులు వాడేస్తున్నారా? వెంటనే ఆపేయండి!

Follow Us