Radish Benefits: బంగాళా దుంప, క్యారెట్, బీట్ రూట్ ల్లానే ముల్లంగి (Radish)కూడా దుంపజాతికి చెందినదే. ఈ ముల్లంగిని ఆసియాలో రోమను పూర్వ కాలంనుంచి పెంచుతున్నారు. పచ్చిగా తింటారు. అంతేకాదు సూప్ , కూరలు వంటివి కూడా తయారు చేస్తారు. ఈ ముల్లంగిని ప్రపంచవ్యాప్తంగా పండించి వినియోగిస్తున్నారు. ఆహారంగా ఉపయోగించే ఈ ముల్లంగిలో ఎన్నో ఔషధం విలువలు ఉన్నాయి. ముల్లంగిని ఆర్ష మొలలు, దగ్గు, ఉబ్బసము, గుల్మము , నొప్పిముక్కు చెవి గొంతు వ్యాధికి ఔషధంగా ఎక్కువుగా ఉపయోగిస్తారు. ముల్లంగి దుంపలో గ్లూకోసిడ్ (glucoside), మైరోసినేసు, ఐసోథియోసైనేట్లు ఉంటాయి. ఈరోజు ముల్లంగి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
*ముల్లంగి కూర ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
*తిన్న ఆహారం జీర్ణం కావడానికి భోజనం తిన్న తర్వాత ముల్లంగి ముక్కలపై మిరియాల పొడి జల్లుకుని తింటే ఆహారం చక్కగా జీర్ణమౌతుంది.
*పైల్స్ తో ఇబ్బంది పడేవారికి ముల్లంగి దివ్య ఔషధం. ముల్లంగి దుంపను ముక్కలు చేసుకుని ఆ ముక్కలపై నిమ్మరసం,, మిరియాలపొడి,ఉప్పు వేసుకుని రోజుకు 3 సార్లు తింటే అద్భుతమైన ఫలితం ఇస్తుంది. *అర్షమొలలు, మలబద్దకం, అజీర్ణం, కామెర్లను నివారిస్తుంది. అంతేకాదు ముల్లంగి రసం, తేనె కలిపి తీసుకున్నా అర్షమొలలు తగ్గుతాయి.
* బ్రాంకైటీస్ తో ఇబ్బంది పడేవారు ముల్లంగి రసంలో తేనె, కల్ల ఉప్పు కలుపుకుని రోజుకు 3సార్లు తీసుకుంటే బ్రాంకైటీస్ తగ్గుతుంది.
*ముల్లంగి గింజలను ఆవుపాలులో వేసి మరిగించి దానిని తాగిన నపుంసకత్వం తొలగుతుంది లైంగిక శక్తి పెరుగుతుంది.
*ముఖం పై మచ్చలు, మొటిమల నివారణకు ముల్లంగి గింజలను మెత్తగా నూరి ముఖానికి పట్టించి కొంత సేపు ఆరనిచ్చి కడిగితే చక్కటి ముఖ సౌందర్యం మీ సొంతం.
* చర్మం పై గజ్జి ఉన్నవారు ముల్లంగి గింజలను నీటిలో నానబెట్టి గుజ్జు చేసి రాస్తే మంచి ఔషదంగా పనిచేస్తుంది.
* ముల్లంగి గింజలు పొడి చేసి నీళ్లలో కలిపి రాత్రి పూట తాగితే కడుపులో పురుగులు చనిపోతాయి
*ముల్లంగి ఆకులను నీటిలో వేసుకుని కషాయంగా కాచి చిటికెడు నిమ్మరసం కలిపి తాగితే మూత్రం మంట తగ్గుతుంది.
Also Read: Greenland Ice: మానవాళికి మరో పెనుముప్పు.. కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్.. పెరుగుతున్న సముద్ర మట్టాలు..
Viral Video: ఆకలి తీర్చుకోవడానికి మేక అద్భుతమైన ఐడియా.. అదిరింది గురూ అంటూ నెటిజన్లు మళ్ళీ వీడియో షేర్..