ఈ చిన్న చిన్న పనులు చేస్తే మీ ఒత్తిడి మొత్తం తగ్గిపోతుంది.. ప్రశాంతంగా, హాయిగా ఉండొచ్చు..!

ఒత్తిడి తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒత్తిడి సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని సాధారణమైన చిట్కాలను ఫాలో అవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఈ చిన్న చిన్న పనులు చేస్తే మీ ఒత్తిడి మొత్తం తగ్గిపోతుంది.. ప్రశాంతంగా, హాయిగా ఉండొచ్చు..!
Stress Management Tips

Updated on: May 13, 2025 | 2:22 PM

ఉదయాన్నే కొంతసేపు సూర్యకాంతిలో గడిపితే శరీరంలో కార్టిసాల్ స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ సాధారణ అలవాటు వల్ల రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండగలుగుతాం. ఇది అంత క్లిష్టమైన విషయం కాదు.. రోజులో కొన్ని నిమిషాలు సరిపోతాయి.

ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిని తాగడం చాలా మంచిది. ఇది శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతూ.. రోజంతా తాజాదనాన్ని అందిస్తుంది. నీళ్లు తాగడం వలన ఒత్తిడి తగ్గుతుంది, శరీరానికి తేమ లభిస్తుంది. నీటి కొరత వల్ల శరీరం నీరసంగా మారి.. ఒత్తిడి అధికంగా అనిపించొచ్చు. కాబట్టి ఈ సాధారణ అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వ్యాయామం చేయడం వలన ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మనం రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి దోహదం చేస్తుంది. ఈ హార్మోన్ వలన ఒత్తిడి తగ్గి మనం ప్రశాంతంగా ఉంటాం. వ్యాయామం మనం బలపడడానికి కూడా అవసరం. అలాగే ఒత్తిడిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.

ఆరోమాథెరఫీ వలన కూడా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. కమలాపండు లేదా లావెండర్ వాసన ద్వారా మన శరీరంలోని కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. దీని వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. అందువల్ల ఈ ప్రక్రియ కూడా ఒత్తిడి నుండి ఉపశమనం అందిస్తుంది.

వెనక్కి నడవడం వలన మనం శారీరకంగా బలపడతాము. ఈ పద్ధతి మన బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది. దీనితో ఒత్తిడి తగ్గుతుంటుంది. మీరు నడుస్తున్నప్పుడు మెడ, పొట్ట, వెన్న విభాగాల్లో బలాన్ని తీసుకుంటారు. ఈ వ్యాయామం వలన శరీరానికి మంచి అనుభూతి వస్తుంది.

గోరువెచ్చని పదార్థాలు.. ఉదాహరణకు కప్పు టీ, వేడి నీరు లేదా హాట్ వాటర్ బాటిల్ పట్టుకోవడం వలన మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసికంగా మనం కాస్త రిలాక్స్ అవుతాము. దీనివల్ల కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి మన మూడ్ బాగుంటుంది. ఇలా చిన్న చిన్న అలవాట్లు మన మనసుకూ.. శరీరానికీ శాంతిని తీసుకురాగలవు.

ఒత్తిడిని తగ్గించడానికి.. మీరు ఆహారాన్ని నెమ్మదిగా నమలడం మంచిది. ఇది జీర్ణవ్యవస్థకు కూడా సహాయపడుతుంది. జీర్ణం బాగా అవడంతో.. మన శరీరంలో శక్తి మెరుగుపడుతుంది. దీనివల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

మీ ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవడం వలన కూడా ఒత్తిడి తగ్గుతుంది. చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వలన కార్టిసాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీని వలన ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.

ఈ పై చిట్కాలను పాటించడం వలన ఒత్తిడి మెల్లగా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, సరైన ఆహారం, మంచి నిద్ర ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బలపడతాయి.. తద్వారా మీరు సంతోషంగా జీవించవచ్చు.